Police Martyrs’ Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Martyrs’ Day 2026: దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అమరుల కుటుంబాలు ఒంటరి కావని, రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన స్మారక పరేడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమర పోలీసుల సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దేశవ్యాప్తంగా 154 మంది పోలీసుల ప్రాణత్యాగం
Also Read
- CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
- MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
- Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
- Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారిలో తెలంగాణకు చెందిన నలుగురు ఉన్నారని వెల్లడించారు. ప్రాణత్యాగం చేసిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మానవీయ కోణంలో తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు ఎంత ముఖ్యమో, శాంతిభద్రతల పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని వివరించారు.
2028 నాటికి పోలీసు శాఖలో ఖాళీల భర్తీ
తెలంగాణ పోలీసు శాఖను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. 2028 నాటికి పోలీసు శాఖలో ఉన్న సిబ్బంది కొరతను పూర్తిగా తీర్చడంతో పాటు అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఒకేసారి 112 మంది డీఎస్పీలను నియమించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా థర్డ్ జెండర్ వ్యక్తులను నియమించడం ద్వారా వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
విధి నిర్వహణలో పోలీసు అధికారి మరణిస్తే అందించే ఎక్స్‌గ్రేషియాను రూ.40 లక్షల నుంచి రూ.కోటికి పెంచినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పోలీసు సిబ్బంది సంక్షేమంతో పాటు వారి కుటుంబాల భవిష్యత్తుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. హోంగార్డు సిబ్బంది మరణించిన సందర్భాల్లో అందించే ఎక్స్‌గ్రేషియాను కూడా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామాని తెలిపారు. పోలీసు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
పోలీసు పిల్లల కోసం యంగ్ ఇండియా స్కూల్
పోలీసు సిబ్బంది పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల పోలీసు సిబ్బంది పిల్లలకు ఒకే రకమైన నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 350 మంది విద్యార్థులు చదువుతున్నారని, వచ్చే ఏడాదికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని తెలిపారు.
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వినియోగం ఆందోళన కలిగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ దేశంలోనే ముందంజలో నిలిచిందని పేర్కొంటూ, ఈగల్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. మరోవైపు కల్తీ ఆహారం కూడా ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతోందని, ఇటువంటి సమస్యలపై కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు.
పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తూనే నేరగాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. పోలీస్ స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే బాధితులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంపొందించడం, బాధితులకు సత్వర న్యాయం అందించడం పోలీసు వ్యవస్థ ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని పేర్కొన్నారు.
అమర పోలీసుల త్యాగాలు మరువలేనివి: డీజీపీ సీవీ ఆనంద్
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ శ్రద్ధాంజలి ఘటించారు. నక్సలిజాన్ని ఎదుర్కొనే క్రమంలో వందలాది మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ప్రజల భద్రత కోసం వారు చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.
పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ప్రస్తుతం 350 మంది విద్యార్థులు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని, వచ్చే ఏడాదికి విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుందని చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల సేవలను గుర్తుచేయడంతో పాటు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరోసారి చాటిచెప్పింది.
తాజావార్తలు
-
Police Martyrs’ Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
-
CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
-
Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
-
Coolpad Cool X Wide: 50MP కెమెరా, 4600mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ప్రీ-ఆర్డర్లు ప్రారంభం!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!