NTV Telugu Site icon

Son’s Revenge: తండ్రి హత్యకు తనయుడి ప్రతీకారం.. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి మరీ..

Son's Plan To Kill Father

Son's Plan To Kill Father

తన తండ్రిని 13ఏళ్ల కిందట హత్య చేసిన వ్యక్తిని రూ.30 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఘటనలో ప్రధాన నిందితుడితో సహా.. ఆరుగురిని మాల్కాజ్‌ గిరి ఎస్‌వోటి , జవహర్‌ నగర్‌ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే మరో నలుగురు పరారీలో వున్నట్లు ప్రకటించారు. వీరి వద్దనుంచి వేట కొడవళ్లు, కత్తులు, కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేష్‌ భగవత్‌ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మేడ్చల్‌ మ‌ల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలం దమ్మాయి గూడ పీఎస్‌ రావు నగర్‌ కు చెందిన ఎస్‌. శ్రీకాంత్‌ రెడ్డి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన తండ్రి జంగారెడ్డికి కాప్రా మండలం చక్రీపురం సతారాంనగర్‌ కు చెందిన రఘుపతికి భూ తగాదాలు ఉన్నాయని వివరించారు. అయితే రఘుపతిని జగ్గారెడ్డి నలుగురిలో అవమానించాడనే కోపంతో… 2009లో కొందరితో కలిసి జగ్గారెడ్డిని హత్య చేశాడు రఘుపతి.

read also: Narasaraopeta Telugu Desam Party : ఆ పార్టీలో ప్రచార ఆర్భాటం పార్టీ పేదల పరువు పోగొట్టిందా.?బొక్కబోర్లా పడ్డారా.?

జగ్గారెడ్డి కుమారుడు ఈ ఘటనను మనసులో పెట్టుకుని రఘుపతిని హతమార్చేందుకు 3నెలల క్రితం ప్రణాళిక రచించాడు. అయితే.. కర్ణాటక షిమెగా జిల్లాలో ఉంటున్న తన తండ్రి స్నేమితుడు వ్యాపారి అయిన మంజునాథ్‌ ను కలిసి విషయం చెప్పాడు. మంజునాథ్‌, రిజ్వాన్‌ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. రఘుపతిని హత్య చేసేందుకు రాజ్వాన్‌తో రూ.30 లక్షల ఒప్పందం కుదుర్చుకుని పథకం ప్రకారం ఈనెల 15న ఉదయం నుంచి రఘును అనుసరించి, రాత్రి 8.30 నిమిషాలకు తన మిత్రులైన ప్రసాద్‌, బాబుతో కలిసి దమ్మాయిగూడలోని ఓ మద్యం దుకాణం వద్ద రఘుపతిని వేట కొడవళ్లు, కత్తితో దాడిచేసి హత్య చేశారు. శ్రీకాంత్‌ రెడ్డి వారిని మార్గమధ్యంలో కలిసి రూ.30 లక్షలు అందించాడు. అయితే ఈవిషయం రఘు భార్య స్వర్ణలత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈఘటనపై వివరాలు బయటకు వచ్చాయి. ముంజునాథ్‌, సాదిక్‌, ఇస్మాయిల్‌, సమీర్‌ఖాన్‌, శ్రీకాంత్‌ రెడ్డిలను అరెస్ట్‌ చేయగా.. రిజ్వాన్‌, భవిత్‌, సుమిత్‌, పరారీలో వున్నారని పేర్కొన్నారు.

Harish Rao: కరోనా టెన్షన్.. బూస్టర్ డోసు పంపిణీ వేగవంతం చేయండి