Site icon NTV Telugu

bowenpally kidnap case: భూమా అఖిలప్రియపై అభియోగాలు

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేవారు పోలీసులు.. టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియపై అభియోగాలు నమోదు చేవారు.. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై కూడా అభియోగాలు మోపారు.. ఇక, వ్యాపారవేత్తను ఐటీ అధికారుల పేరుతో కిడ్నాప్ చేసిన కేసులో.. వ్యాపారవేత్త కిడ్నాప్‌నకు ప్లాన్‌ చేసిన సుపారి గ్యాంగ్‌పై కూడా అభియోగాలు నమోదు చేశారు.. మొత్తం 16 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు బోయిన్‌పల్లి పోలీసులు.. కాగా, ఈ కేసులో అరెస్ట్‌ అయిన భూమా అఖిలప్రియకు ఆ తర్వాత సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. ఈ కేసులో 17 రోజుల పాటు చంచల్‌గూడ జైలులో ఉన్న అఖిలప్రియకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె జైలు నుంచి విడుదలయ్యారు..

Read Also: UP Polls: రాజ్‌నాథ్‌ సింగ్‌కు నిరసన సెగ.. ఉద్యోగాల కోసం నినాదాలు

Exit mobile version