Site icon NTV Telugu

MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మహారాష్ట్రలో పోలీసు కేసు.. ఎందుకంటే..?

Raja Singh

Raja Singh

MLA Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మహారాష్ట్రలో పోలీసు కేసు నమోదైంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారంటూ గోషామహల్ ఎమ్మెల్యేపై షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే కుమారుడు, ఎమ్మెల్యే నితీశ్ రాణేపై కూడా పోలీసు కేసు నమోదైంది. గత శనివారం షోలాపూర్‌లోని రాజేంద్ర చౌక్ నుండి కన్నా చౌక్ వరకు హిందూ జన ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో బీజేపీ ఎమ్మెల్యేలు నితీశ్‌ రాణే, రాజాసింగ్‌తో పాటు హిందూ సమాజ్‌ నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Read also: Madhya Pradesh: ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన బాలిక

ఆ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఫిర్యాదులు అందడంతో పాటు జైల్‌రోడ్డు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు రాజాసింగ్, నితీష్ రాణే, హిందూ సమాజ్ నేతలందరిపై ఐపీసీ 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. లవ్ జిహాద్‌పై రాజాసింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పోలీసు అధికారులు తెలిపారు. జిహాదీలు, ముస్లింల ప్రార్థనా స్థలాలైన మసీదుల కూల్చివేతపై మరో ఎమ్మెల్యే నితీశ్ రాణే మాట్లాడారు. మతాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడినందుకు ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసినట్లు షోలాపూర్ పోలీసు అధికారులు తెలిపారు.
Praja Palana: ప్రజాపాలనలో ‘శివయ్య’ పేరుతో దరఖాస్తు.. ఆలయం కోసం ఇందిరమ్మ ఇల్లు కావాలని అర్జీ

Exit mobile version