Site icon NTV Telugu

PM Modi: జీ20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదే

Modi Speech At Isb

Modi Speech At Isb

ఐఎస్పీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రయాణంలో ఐఎస్‌బీ కీలక మైలురాయికి చేరుకుందని, . 2001లో నాటి ప్రధాని వాజ్‌పేయ్‌ దీనిని ప్రారంభించారని, ఎంతోమంది కృషి వల్లే ఆసియాలోనే టాప్‌ బిజినెస్‌ స్కూల్‌గా అవతరించిందన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులు ఎన్నో స్టార్టప్‌లు ప్రారంభించారని పేర్కొన్నారు. G20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మన భారతే అన్న ప్రధాని.. ప్రపంచంలో బలమైన స్టార్టప్ ఇకో సిస్టమ్ ఉన్న దేశాల్లో భారత్ మూడొదని పేర్కొన్నారు. భారత్‌కు రికార్డ్ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు.

ఇండియా అంటే ఇప్పుడు బిజినెస్ అనే స్థాయికి ఎదిగిందని.. మన దేశ యువత ప్రపంచానికే నాయకత్వం వహిస్తుందని ప్రధాని చెప్పారు. ‘‘మీ వ్యక్తిగత లక్ష్యాలను.. దేశ లక్ష్యాలతో కలపండి.. ఆ దిశగా ఆలోచించండి’’ అని విద్యార్థుల్ని ప్రోత్సాహించారు. మీ మీద నమ్మకంతో ముందడుగు వేయాలని జోష్ నింపారు. దేశ యువతకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాజకీయ అస్థిరత వల్ల దేశం గత మూడు దశాబ్దాలుగా పాలసీ నిర్ణయాలు తీసుకోలేకపోయిందని, అయితే గడిచిన 8 ఏళ్లుగా దేశ యువత కోసం నిరాటంకంగా సంస్కరణలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో 40 శాతం బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీలు ఇండియాలో జరుతున్నాయన్ని ప్రధాని వెల్లడించారు.

కరోనా సమయంలో పిపిఈ కిట్ తయారీ కంపెనీలు ఇండియాలో లేవని.. కానీ చూస్తుండగానే 11 వందల పిపిఈ కిట్‌లు తయారు చేసే కంపెనీల నెట్‌వర్క్ ఏర్పటైందని ప్రధాని మోదీ తెలిపారు. మొదట్లో మనకు విదేశీ వ్యాక్సిన్ దొరుకుతుందో లేదోనని ఆందోళన దేశ ప్రజలు ఆందోళన చెందేవాళ్ళని.. కానీ ఆ వ్యాక్సిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఎనిమిది ఏళ్లుగా దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్య పెంచుకున్నామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశానికి ఎఫ్‌డీఐ(FDI)లు వచ్చాయని ప్రధాని మోదీ చెప్పారు.

Exit mobile version