NTV Telugu Site icon

BJP Meetings: బీజేపీ అగ్రనేతల జోరు ప్రచారం.. నేడు ఎవరు ఎక్కడంటే?

Bjp Mweeting Talangana

Bjp Mweeting Talangana

BJP Meetings: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు కేంద్రంలోని అధికార బీజేపీ కూడా ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఆయా పార్టీల అగ్రనేతలు ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సమావేశాలు, సమావేశాలతో రేపటితో (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో బీజేపీ ప్రచార జోరు పెంచింది.

ప్రధాని మోడీ షెడ్యూల్..

ప్రధాని మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఇవాళ హైదరాబాద్ బయలదేరనున్నారు. ఉదయం 10:25 కి తిరుపతి నుంచి బయల్దేరనున్న మోడీ. ఉదయం 11:40 కి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని అనంరతం అక్కడి నుంచి మధ్నాహ్నం 12:45 గంటలకు మహబూబాబాద్ సభలో పాల్గొననున్నారు. అనంతరం మధ్నాహ్నం 2:30 గంటకలు కరీంనగర్ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:15 బేగంపేట్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఆర్టీసీ క్రాస్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహిస్తారు. నంతరం 7.30 నుండి 7.40 వరకు అమీర్ పేట గురుద్వారకు వెళ్లి దర్శించుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 8.00 నుండి 8.45 ఎన్టీవీ భక్తి కోటి దీపోత్సవంలో పాల్గొంటారని బీజేపీ శ్రేణులు వెల్లడించారు.

Read also: Indian Railway: రైలులో ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి..

ఇవాళ మధ్నాహ్నం 12 గంటలకు హుజూరాబాద్ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు పెద్దపల్లి రోడ్ షో నిర్వహించి.. మధ్నాహ్నం 3 గంటల మంచిర్యాల రోడ్ షో లో అమిత్ షా పాల్గొంటారు. ఇవాళ మధ్నాహ్నం 12.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా జగిత్యాల రోడ్ షో నిర్వహించనున్నారు. బోధన్, బాన్సువాడ, జుక్కల్ బహిరంగ సభల్లో నడ్డా పాల్గొననున్నారు. ఇవాళ అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ తెలంగాణలో పర్యటించనున్నారు. దేవరకద్ర, పరకాల, మంథని, వరంగల్, దుబ్బాకలో పర్యటిస్తారు. నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హన్మకొండలో మేధావులతో భేటీ కానున్నారు. సిద్దిపేటలో సభలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూరు పాల్గొని ప్రసంగించనున్నారు. అలంపూర్ లో కేంద్రమంత్రి మురళీధరన్ డోర్ టూ డోర్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఇవాళ అగ్రనేతలు ప్రచారంతో తెలంగాణ కాషాయిమయం కానుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో పార్టీ శ్రేణులు ప్రాచారంలో స్పీడ్ పెంచాలి.
Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. క్లారిటీ ఇచ్చిన అధికారులు