PM Modi Photo on LPG Cylinder: నిర్మలా సీతారామన్ ఆదేశించారు.. 24 గంట్లో మోడీ ఫొటో పెట్టారు.. కానీ, ప్లేసే మారింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫోటోల ఫ్లెక్సీల యుద్ధం ఈ నాటిది కాదు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ.. హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది.. సోషల్ మీడియాలోనూ.. పెద్ద రచ్చే జరిగింది.. అయితే.. ఇప్పుడు.. మరోసారి అలాంటి యుద్ధానికి తెరలేపారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్… శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆమె.. బీర్కూరు మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణంలో పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని తనిఖీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడారు.. అయితే, రేషన్ షాపుల్లో పూర్తిగా ఉచితంగా రేషన్ అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్లెక్సీని ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మలా సీతారామన్.. ఈ విషయంలో రేషన్ డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి… వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.. అయితే, ఆ రేషన్ షాపు దగ్గర మోడీ ఫొటో కనిపించలేదు.. కానీ, మరో చోట మాత్రం ప్రధాని ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి..
Read Also: Robbery: రూ.6కోట్ల విలువైన నగలు దోచారు… రూ.100 పేటీఎం చేసి దొరికిపోయారు..!
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
వినియోగదారులకు వంట గ్యాస్ పంపిణీ చేసేందుకు ఎల్పీజీ సిలిండర్ల లోడ్‌తో ఓ ఆటో వెళ్తుంది.. ఆ ఆటో నిండా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి.. ఇక, ఆ సిలిండర్లకు ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో అటించి ఉన్నాయి.. ‘మోడీ జీ రూ.1105’ అని రాసిఉన్న ఆ ఫొటోలు ప్రధాని మోడీ గట్టిగా నవ్వుతూ కనిపిస్తున్నారు.. అయితే, దీనిపై వెరైటీగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అడిగారు.. 24 గంటలు తిరగక ముందే.. ఇలా ప్రధాని ఫొటోలు పెట్టారంటూ సెటైర్లు వేస్తున్నారు.. మొత్తంగా.. మరోసారి టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫ్లెక్సీ, ఫొటోల వార్ తెరపైకి వచ్చింది. కాగా, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయయని.. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1100 దాటించిన ఘనత మోడీదేనంటూ.. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!