NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌.. హైదరాబాద్‌ని ఎంఐఎంకి రాసిచ్చింది..

Vemulawada Naredra Modi

Vemulawada Naredra Modi

PM Modi: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేసి హైదరాబాద్ ని ఎంఐఎంకి రాసిచ్చారని పీఎం మోడీ అన్నారు. బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి విషయంలోనూ ఒక్కటే అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు వీరు.. అధికారంలో ఉన్నప్పుడు వారు తిట్టుకున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసు విషయంలో బీఆర్ఎస్ మౌనంగా ఉంది.. కాళేశ్వరం అవినీతి అన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మర్చిపోయిందన్నారు.

Read also: PM Modi: వేములవాడలో కోడెమొక్కులు తీర్చుకున్న ప్రధాని.. సభలో మోడీ ప్రసంగం..

తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. డబుల్ ఆర్ కలెక్షన్స్ తెలుగులో వచ్చిన ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ ని మించి పోయాయన్నారు. తెలంగాణని లూటీ చేస్తున్న ఒక ఆర్… ఢిల్లీలో దేశాన్ని లూటీ చేయాలని చూస్తున్న ఇంకో ఆర్ కి దోచిన సొమ్ము పంపుతున్నాడన్నారు. డబుల్ ఆర్ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్నారు. గత ఐదేళ్ల నుంచి అంబాని ఆదాని జపం చేస్తున్నారు కాంగ్రేస్ యువరాజు అంటూ సెటైర్ వేశారు. ఇప్పుడు బీజేపీ రూపంలో ఎంఐఎంకి భయం పట్టుకుందన్నారు. మజ్లీస్ ని గెలిప్పించేందుకు రెండు పార్టీలు ఏకం అయ్యాయన్నారు.

Read also: Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి.. భువనగిరి సభలో అమిత్ షా ప్రసంగం

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు దేశంలో మూడు దశల ఎన్నికలు జరిగాయన్నారు. ఈ మూడు దశల పోలింగ్ తర్వాత కాంగ్రెస్ నిరాశలో మునిగిందన్నారు. కరీంనగర్ లో బీజేపీ విజయం ఖరారు అయిందని తెలిపారు. ఈ పదేళ్ళలో భారత్ వేగంగా పురోగమించింది.. అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. భారత దేశం ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ గా అవతరించిందని తెలిపారు. రక్షణ రంగంలో ఎగుమతులు చేసే స్థాయికి దేశం ఎదిగిందన్నారు. నేను ఇంతకు ముందు గుజరాత్ సీఎం గా చేసాను… నా సొంత రాష్ట్రంలో కూడా ఉదయం 10 గంటలకు ఇంత జన సమీకరణ చూడలేదన్నారు. ఇంతటి ప్రేమ చూపుతున్న తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో దేశం అన్ని రంగాల్లో నిర్వీర్యం అయిందన్నారు. బీజేపీ పాలనలో అన్ని రంగాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చిందన్నారు.

Read also: Mallu Bhatti Vikramarka: నేడు నిర్మల్ జిల్లాకు భట్టి విక్రమార్క.. షెడ్యూల్ ఇదే..

రైతులకు కిసాన్ సమ్మన్ ఇచ్చాం.. పసల్ బీమా ఇచ్చామని.. టెక్స్ టైల్ పార్క్ లు ఏర్పాటు చేసామన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ నేషన్ ఫస్ట్.. ఫ్యామిలీ నెక్స్ట్ అనే నినాదాన్ని పాటిస్తుందన్నారు. కానీ కాంగ్రెస్ ,బీఆర్ఎస్ పార్టీలకు ఫ్యామిలీ ఫస్ట్.. దేశ ప్రయోజనాలు నెక్స్ట్ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. రెండూ కుటుంబ పార్టీలే.. రెండూ అవినీతిలో కూరుకుపోయిన పార్టీలే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేసిందన్నారు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ విధానాలనే కొనసాగిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రధానిగా పని చేసిన పీవీ నరసింహారావును అవమానించిందన్నారు. మేము భారత రత్న ఇచ్చి గౌరవించింది.. ఆయన సేవలను మేము గుర్తించామని క్లారిటీ ఇచ్చారు.
CM Revanth Reddy: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి.. బాచుపల్లి ఘటనపై సీఎం సీరియస్‌