బీజేపీ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోడీ జులై 2,3,4 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ టూర్‌కు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 12 .45 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి ప్రధాని బయలుదేరి.. 2 .55 బేగం పేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలు దేరి.. 3.20 గంటలకు హెచ్‌ఐసీసీ నోవాటెల్ కి ప్రధాని చేరుకుంటారు. 3.30 నోవాటెల్ కన్వేషన్ సెంటర్ కి ప్రధాని చేరుకుంటారు. 3.30 నుండి 4 గంటల వరకు రిజర్వడ్. సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. రాత్రి 9 గంటలు నుండి రిజర్వ్.
మరుసటి రోజు 3వ తేదీన..
ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 4. 30 వరకు బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. సాయంత్రం 4. 30 నుండి 5.40 వరకు రిజర్వ్. సాయంత్రం 5.55 హెచ్‌ఐసీసీ వద్ద హెలిప్యాడ్ కి చేరుకోనున్న ప్రధాని.. సాయంత్రం 6.15 నిమిషాల కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కి మోడీ చేరుకుంటారు. 6 .30 నిమిషాలకి రోడ్డు మార్గాన పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు మోడీ హాజరవుతారు. 6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో ఉండునున్న మోడీ.. రాత్రి 7.35 నుండి బహిరంగ సభ నుండి బయలుదేరుతారు. ఆ రాత్రి కి నోవాటేల్ లేదా రాజ్ భవన్ లో బస చేయనున్నారు మోడీ.
4వ తేదీన…
ఉదయం 9.20 కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కి మోడీ చేరుకుంటారు. బేగం పేట్ నుండి విజయవాడకు ప్రత్యేక విమానంలో మోడీ వెళ్తారు. 10.10 నిమిషాలకు విజయవాడ చేరుకొనే అవకాశం ఉంది. అయితే.. ఇందులో మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉందంటున్న పోలీసులు వెల్లడించారు.