Site icon NTV Telugu

PM Modi Hyderabad Tour LIVE UPDATES

Modi Live

Modi Live

PM Modi Hyderabad Tour LIVE UPDATES

The liveblog has ended.
  • 26 May 2022 03:40 PM (IST)

    వర్షంలో మోదీ కాన్వాయ్...

    గచ్చి బౌలి ఐఎస్ బీ నుంచి కార్యక్రమం ముగించుకుని బేగంపేటకు బయలుదేరే ముందు భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్ వర్షంలోనే బేగంపేటకు బయలు దేరింది. బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకున్న మోదీ కాసేపట్లో చెన్నై బయలుదేరనున్నారు.

  • 26 May 2022 03:38 PM (IST)

    బేగంపేట ఏయిర్ పోర్ట్ కు చేరుకున్న మోదీ.. కాసేపట్లో చెన్నైకి

    హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ కార్యక్రమం అనంతరం బేగం పేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి తమిళనాడు చెన్నైకి వెళ్లనున్నారు. తమిళనాడులో వివిధ డెవలప్మెంట్ ప్రాజెక్టులను సీఎం ఎంకే స్టాలిన్ తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.

  • 26 May 2022 03:34 PM (IST)

    ఆర్థిక వ్యవస్థలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్నాం.

    దేశంలో ఆర్థిక వ్యవస్థ డెవలప్ మెంట్ కు ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థిక వ్యవస్థలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో చిన్న వ్యాపారలపై దృష్టి పెట్టాలి...వారికి ప్రపంచంతో నెట్ వర్క్ చేయాలి...సాంకేతికత అందించాలి.వీటిపై మీరు దృష్టి పెట్టాలి. మీరు చిన్న వ్యాపారుల అభివృద్ధి కోసం పనిచేస్తే ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు తయారు అవుతారు. దేశం కోసం పనిచేయలన్న మీ సంకల్పం... దేశంను మరింత ముందుకు తీసుకెళ్తుంది

  • 26 May 2022 03:31 PM (IST)

    ఆశావహ జిల్లాల కార్యక్రమాన్ని తప్పకుండా స్టడీ చేయాలి.

    ఆశావహ జిల్లాల కార్యక్రమాలను తప్పకుండా మీరు స్టడీ చేయాలని విద్యార్థులకు సూచించారు. దేశంలో 100కు పైగా వెనకబడిన జిల్లాల్లో డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. వెనుకబడిన జిల్లాలను వాటి మానాన వాటిని వదిలేయలేదని... బ్యాక్ వర్డ్ జిల్లాలను బ్యాక్ వర్డ్ గానే ఉంచలేదని ఆయన అన్నారు. దేశంలో యువ అధికారులను ఆ జిల్లాలకు పంపించామని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలోనే డెవలప్ అయిన జిల్లాలలో ఆశావహ జిల్లాలు పోటీ పడుతున్నాయని మోదీ అన్నారు.

  • 26 May 2022 03:26 PM (IST)

    దేశీయంగా కరోనా వ్యాక్సిన్లు తయారు చేసుకున్నాం... 100 దేశాలకు పంపిణీ చేశాం.

    కరోనా తరువాత ఆరోగ్య మౌళిక సదుపాయాలు మెరుగయ్యాయని.. మన దేశం సొంతంగా వ్యాక్సిన్లను తయారు చేసుకుందని... 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేశామని అన్నారు. కరోనాకు ముందు దేశంలో పీపీఈ కిట్ల తయారీ లేదని.. ప్రస్తుతం దేశంలో 1100 సంస్థలు పీపీఈ కిట్లను తయారు చేస్తున్నాయని వెల్లడించారు ప్రధాని మోదీ. 8 ఏళ్లలో మెడికల్ కాలేజీలను పెంచుకున్నామని అన్నారు.

  • 26 May 2022 03:15 PM (IST)

    మా ప్రభుత్వం దేశ యువత పక్షాన నిలబడుతుంది

    మా ప్రభుత్వం దేశ యువత పక్షాన నిలబడుతుందని మోదీ అన్నారు. దేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. మీ ఆలోచనలతో దేశాన్ని మరింత శక్తి వంతంగా తీర్చుదిద్దుతాం అని అన్నారు. రిఫార్మ్, ఫెర్ఫామ్ , ట్రాన్స్ఫామ్ ఈ మంత్రం దేశంలోని గవర్నమెంట్ ను నిర్థేశిస్తాయని అన్నారు.

  • 26 May 2022 03:09 PM (IST)

    భారత దేశ యువత ప్రపంచాన్ని లీడ్ చేస్తుంది.

    ట్రెడిషనల్ బిజినెస్, తయారీ, సేవా రంగాల్లో, స్టార్టప్స్ లో యువత పాత్ర ఉంది. భారత యువత ప్రపంచాన్ని లీడ్ చేస్తుంది. నాకు మీ పైన విశ్వాసం ఉందని మోదీ అన్నారు. ప్రపంచం భారత్ దేశాన్ని, యువతను, భారతీయ ప్రోడక్ట్స్ ను ఎంతో నమ్మకంగా చూస్తున్నాయని అన్నారు.

  • 26 May 2022 03:03 PM (IST)

    కరోనా పరిస్థితుల్లో ప్రపంచం భారత్ సామర్థ్యాన్ని చూసింది.

    కరోనా పరిస్థితుల్లో కూడా భారత్ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలు చూశాయని.. ప్రపంచంలో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిన్నదని... యుద్ధ పరిస్థితుల్లో కూడా భారత్ గ్రోత్ లో ముందుందని మోదీ అన్నారు. ఇప్పటి వరకు భారత్ రికార్డ్ స్థాయిలో ఎఫ్ డీ ఐలు వచ్చాయని మోదీ చెప్పారు. ప్రపంచం ఇప్పుడు ఇండియా అంటే బిజినెస్ అనుకుంటుందని అన్నారు. ఇది కేవలం కేవలం సర్కార్ ప్రయత్నాలతోనే రాలేదని.. దీనికి ఐ ఎస్ బీ వంటి విద్యాసంస్థలు, విద్యార్థుల ప్రయత్నాలు కూడా ఉన్నాయని అన్నారు.

  • 26 May 2022 02:59 PM (IST)

    మొబైల్ ఫోన్లలో మొదటి స్థానం... ఇంటర్నెట్ వినియోగంలో రెండో స్థానంలో భారత్

    భారత దేశం శరవేగంగా డెవలప్ అవుతోందని.. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల వినియోగంలో భారత్ మొదటి స్థానంలో, ఇంటర్నెట్ వినియోగంలో రెండో స్థానంలో ఉంది. గ్లోబల్ రిటైల్ ఇండెక్స్ లో రెండో స్థానంలో, స్టార్టప్స్ ఎకో సిస్టమ్ మూడో స్థానంలో ఉందని... ప్రపంచంలో మూడో కన్జూమర్ మార్కెట్ లో మూడో స్థానంలో ఉందని మోదీ అన్నారు. జీ 20 దేశాల్లో స్ట్రాంగెస్ట్ ఎకానమీగా ఉందని... వేగంగా డెవలప్ అవుతున్న ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్నామని మోదీ అన్నారు.

  • 26 May 2022 02:53 PM (IST)

    2001లో అప్పటి ప్రధాని వాజ్ పేయి ఐఎస్ బీని స్థాపించారు.

    ఐఎస్ బీ స్టూడెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పెయి హైదరాబాద్ లో ఐఎస్ బీ ని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేల మంది స్టూడెంట్లు విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఐఎస్ బీ ఆసియాలోని టాప్ బిజినెస్ స్కూళ్లలో ఒకటి. ఐఎస్ బీ విద్యార్థులు అనేక స్టార్టప్స్, యూనికార్న్ లను స్థాపిస్తున్నారని కొనియాడారు.

  • 26 May 2022 02:35 PM (IST)

    హైద‌రాబాద్ ఐఎస్ బి చేరుకున్న ప్ర‌ధాని మోడీ

    విద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగించ‌నున్నారు. అనంత‌రం అకాడ‌మిక్ సెంట‌ర్ లో మోడీ మొక్క‌లు నాట‌నున్నారు.

    https://youtu.be/2-hy27Wr5pw

  • 26 May 2022 02:11 PM (IST)

    గచ్చిబౌలి స్టేడియం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న మోడీ

    గచ్చిబౌలి స్టేడియం హెలిప్యాడ్ వద్దకు నరేంద్రమోడీ చేరుకున్నారు. మరికాసేపట్లో గచ్చిబౌలి స్టేడియం ఎగ్జిట్ గేట్ నుండి బయటికి రానున్నా మోడీ కాన్వాయ్. ఐఎస్బీ ప్రాంగణానికి రోడ్డు మార్గం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు.

  • 26 May 2022 02:04 PM (IST)

    ISB కార్య‌క్ర‌మానికి ప్రధాని మోడీ

    భార‌త్ మాతాకీ జై... భార‌త్ మాతాకీ జై అంటూ ప్ర‌సంగాన్ని ముగించిన ప్ర‌ధాని మోదీ. ఐఎస్బీకి ప్రాంగణంలో ప్రసంగం అనంతరం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వార్షికోత్సవ, స్నాతకోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ పయనమయ్యారు.

  • 26 May 2022 02:03 PM (IST)

    ఓ పార్టీకి గులాంగా టీఆర్ఎస్‌ పనిచేస్తోంది -మోడీ

    కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారు, కేంద్ర పథకాల పేర్లు మార్చినా.. ప్రజల మనసులో మమ్మల్ని తీసేయలేరని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఓ పార్టీకి గులాంగా మారి టీఆర్ఎస్‌ పనిచేస్తోంది, మూఢనమ్మకాలతో తెలంగాణలో సర్కార్‌ నడుస్తోంది, నేను టెక్నాలజీని నమ్ముతా.. మూఢ నమ్మకాలు కాదు-ప్రధాని మోడీ

  • 26 May 2022 02:00 PM (IST)

    టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ-మోడీ

    తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్‌ కోసం అమరవీరులు తమ ప్రాణాలు అర్పించారన్నారు. మీ అభిమానమే.. నా బలమని ప్రధాని మోడీ తెలిపారు. టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోందన్నారు.

  • 26 May 2022 01:58 PM (IST)

    పట్టుదల, పౌరుషానికి మారు పేరు తెలంగాణ-మోడీ

    పట్టుదల, పౌరుషానికి మారు పేరు తెలంగాణ అని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేదే బీజేపీ ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను తరిమేస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్ర అభివృద్ధికి పోరాటం చేస్తామన్నారు.

  • 26 May 2022 01:56 PM (IST)

    తెలంగాణ పోరాటంలో వేలాది మంది త్యాగం-మోడీ

    తెలంగాణ పోరాటంలో వేలాది మంది త్యాగం చేశారు. తెలంగాణ ఉజ్వ‌ల భ‌విష్య‌త్ కోసం ఈత్యాగం చేశారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్న‌ట్లు నా దృష్టికి వ‌చ్చింద‌న్నారు మోదీ. తెలంగాణ‌లో వార‌స‌త్వ‌పు రాజ‌కీయ‌ల‌కు వ్య‌తిరేకంగా మ‌నం పోరాడాల‌ని ప్ర‌ధాని పిలుపు నిచ్చారు.

  • 26 May 2022 01:55 PM (IST)

    తెలంగాణాను విఛ్చిన్నం చేసే వారు నాడు నేడు ఉన్నారు- ప్ర‌ధాని

    తెలంగాణాను విఛ్చిన్నం చేసే వారు నాడు నేడు కూడా ఉన్నార‌ని ప్ర‌ధాని అన్నారు. తెలంగాణ‌లో బీజేపీ రావ‌డం ఖాయ‌మ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌లు స్ప‌ష్ట‌మైన సాంకేతాలు ఇచ్చాయ‌ని అన్నారు. టీఆర్ ఎస్ పాల‌న అవినీతి పాల‌న అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • 26 May 2022 01:54 PM (IST)

    కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యింది-మోడీ

    కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యింది. కేవలం ఒక కుటుంబం కోసం తెలంగాణ రాలేదు. కుటుంబ పార్టీను తరిమేస్తేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోంది. యువతతో కలిసి తెలంగాణను మేం ఉన్నత శిఖరాలను తీసుకెళ్తాం. దేశ ఐక్యత కోసం సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.'' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

  • 26 May 2022 01:53 PM (IST)

    సీఎం వాస్తు పై ప్రధాని మోడీ సెటైర్స్

    తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తుందని ప్రధాని అన్నారు. స్కీమ్ ల పేర్లు మారుస్తూ తెలంగాణ సర్కార్ రాజకీయాలు చేస్తుందని మండి పడ్డారు. మీరు రాజకీయాలు చేయండి...కానీ జనం గుండెల్లో మా పేరును మాత్రము చేరిపివేయలేరని అన్నారు. అంధ విశ్వాసం కలవారితో తెలంగాణను రక్షించుకోవాలని సీఎం వాస్తు పై ప్రధాని సెటైర్స్ వేశారు.

  • 26 May 2022 01:50 PM (IST)

    తెలంగాణ పోరాటంలో వేలాది మంది త్యాగం- మోడీ

    తెలంగాణ పోరాటంలో వేలాది మంది త్యాగం చేశారు. తెలంగాణ ఉజ్వ‌ల భ‌విష్య‌త్ కోసం ఈత్యాగం చేశారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్న‌ట్లు నా దృష్టికి వ‌చ్చింద‌న్నారు మోదీ. తెలంగాణ‌లో వార‌స‌త్వ‌పు రాజ‌కీయ‌ల‌కు వ్య‌తిరేకంగా మ‌నం పోరాడాల‌ని ప్ర‌ధాని పిలుపు నిచ్చారు.

  • 26 May 2022 01:25 PM (IST)

    తెలుగులో ప్ర‌సంగం ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

    సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందని టీఆర్ఎస్‌కు చురకలంటించారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రాంరభించిన ప్రధాని మోదీ.. తాను ఎప్పుడు వచ్చినా తెలంగాణ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారని అన్నారు. పట్టుదల, పౌరుషానికి తెలంగాణ మారు పేరని పేర్కొన్నారు.

  • 26 May 2022 01:19 PM (IST)

    హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని మోడీ

    ప్రధాని మోడీ హైదరాబాద్‌లో నేడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ముందుగా బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

Exit mobile version