Site icon NTV Telugu

విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేసారు ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ. ప్రి ప్రైమరీ, ప్రైమరీ తరగతులకూ ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు పిటిషనర్. కరోనా మూడో దశ ముప్పు ఉన్నందున ప్రత్యక్ష బోధన సరికాదన్నారు పిటిషనర్. ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. పిల్ పై ఈ నెల 31న విచారణ చేపట్టనున్నారు తాత్కాలిక సీజే జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం. అయితే కరోనా కారణంగా తెలంగాణలో గత ఏడాదిన్నరగా మూసి ఉన్న విద్య సంస్థలను వచ్చే నెల 1 నుండి తెరువనున్నట్లు ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే.

Exit mobile version