ఆ ఇద్దరు ఇష్టపడ్డారు… వారిద్దరి ప్రొఫెషన్ కూడా ఒకటే.. ఒకే రంగంలో పనిచేస్తున్న వారు ఒకే విధంగా ఆలోచిస్తారనే దానికి నిదర్శనం ఈ వెడ్డింగ్ కార్డు. తాము ఏ వృత్తిలో స్థిరపడ్డామనే విషయాన్ని అందరికీ తెలిసేలా ఏదో ఒకటి చేయాలి అని అనుకొని వినూత్నంగా ఆలోచించారు. తమ ఆలోచన విధానానికి అనుగుణంగా తమ వృత్తిని తెలిపే వెడ్డింగ్ కార్డును తయారు చేశారు. అది చూసిన వారంతా టాబ్లెట్ షీట్ అనుకున్నారు కానీ మొత్తం క్షుణ్ణంగా చదివితే కానీ అది వివాహ ఆహ్వాన పత్రిక అని అర్థం కాదు.. వధూవరులు ఇద్దరు ఫార్మా రంగంలో పనిచేస్తూ ఉండడం.. ఇష్టమైన వృత్తి ఒకవైపు, మరోవైపు ఇద్దరి మధ్య అనురాగం కలిపి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకు వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న పెళ్లి పత్రిక ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
Border 2 : ‘బోర్డర్’ సినిమాలకు థియేటర్లో పెను ప్రమాదం!
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన ఉబ్బల జయరాజు, జానకమ్మల కుమార్తె ఉబ్బల శిరీష ఎం.ఫార్మసీ పూర్తి చేసి విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తోంది.తన పెళ్లి పత్రికను వినూత్నంగా, తాను చేస్తున్న వృత్తికి గౌరవంగా రూపొందించి అందరినీ ఆకట్టుకునే విధంగా పెళ్ళి కార్డు డిజైన్ చేశారు. ఆ పెళ్లి పత్రికను చూసిన ప్రతి ఒక్కరూ ముందుగా టాబ్లెట్ షీట్ అని భ్రమ పడేలా ఉంది. ఈ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన కిన్నెర భాస్కర్, ధనమ్మ దంపతుల కుమారుడు కిన్నెర నవీన్ ఎంబీఏ పూర్తి చేసి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది. శిరీష కూడా ఎం.ఫార్మసి పూర్తి చేసి ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది.
వధూవరులిద్దరూ ఫార్మా రంగానికి చెందిన వారు కావడంతో, తమ వివాహ ఆహ్వాన పత్రిక కూడా అదే శైలిలో ఉండాలని ఆలోచన చేశారు. తన వృత్తిపై ఉన్న ప్రేమతో, సంప్రదాయ శుభలేఖకు భిన్నంగా టాబ్లెట్ షీట్ ఆకృతిలో పెళ్లి ఆహ్వాన పత్రికను తయారు చేయించారు.. ఈ వినూత్న శుభలేఖ పెళ్లికి ముందే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నూతన జంటను పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.శిరీష ఆలోచనను ఎంతో ఆనందంగా అంగీకరించిన వరుడు నవీన్‌ను కూడా అందరూ ప్రశంసిస్తున్నారు.ఫార్మాసిస్ట్‌గా నా పెళ్లి శుభలేఖను ఇలా ప్రత్యేకంగా రూపొందించుకోవడం నా డ్రీమ్. అది నిజమవడంతో చాలా సంతోషంగా ఉంది అంటూ శిరీష తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
