Site icon NTV Telugu

Inappropriate posts on Secretariat: సచివాలయంపై అనుచిత వ్యాఖ్యలు.. కరీంనగర్ కు చెందిన వ్యక్తి అరెస్ట్

Inappropriate Posts On Secretariat

Inappropriate Posts On Secretariat

Inappropriate posts on Secretariat: తెలంగాణ నూతన సచివాలయం కొత్తరూపకల్పనకు రూపుదిద్దుకుంటోంది. అయితే నూతన సచివాలయం మొదలు పెట్టినప్పటి నుంచి సచివాలయంపై పలు పార్టీనేతలు, మరి కొందరు ఆకతాయిలు షోషల్‌ మీడియా పోస్ట్‌లు తీవ్ర వివాదానికి సృష్టించాయి. దీనిపై ఫోకస్‌ పెట్టిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎట్టకేలకు వారిని అదుపులో తీసుకున్నారు. నూతన సచివాలయంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్‌ యువకుడు బీజేపీ కార్యకర్తగా గుర్తించారు. ఆయువకుడిపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు.

Read also:  Earthquake in Suryapet: సూర్యాపేట జిల్లాలో భూకంపం.. పరుగులు తీసిన జనం

అసలు ఏం జరిగింది:
తెలంగాణ నూతన సచివాలయం అగ్నిప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులను, కామెంట్లు బీజేపీ కార్యర్తలు పెట్టారు. నూతన సచివాలయంలో చలిమాంటల వల్ల ప్రమాదం జరిగిందని ఫెస్బుక్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కు ఓ బీజేపీ కార్యకర్త రీ పోస్ట్ చేస్తూ క్షుద్రపూజలు చేసారంటూ కామెంట్‌ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన ఆపోస్ట్ తీవ్ర దుమారం రేపింది. సచివాలయంలో క్షుద్రపూజలు చేసారంటూ కరంనగర్‌ కు చెందిన పరందామయ్యా బీజేపీ కార్యకర్తంగా గుర్తించారు. పరందమయ్యపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై లాఠీ ఝురి చూపించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. సచివాలయం పై పార్టీ కార్యకర్తలపై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన పోస్ట్ లు చేసి వైరల్‌ చేసి ప్రజలను భయబ్రాంతులు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసుల చెబుతున్నారు. ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. పరందామయ్యా తనే ఉద్దేశపూర్వకంగా ఈ పోస్ట్ లు పెట్టాడా? లేక పరందామయ్యను ప్రేరేపించి పోస్ట్‌లు పెట్టుందుకు సమర్ధించారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తు్న్నారు.
Taraka Ratna: తండ్రిని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన కూతురు.. కన్నీధారను ఓదార్చేవారెవరు

అయితే.. ఇది ఉండగా.. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. కరీంనగర్ కి చెందిన బీజేపీ కార్యకర్త పరందామయ్యా పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై, వారి కుటుంబంపై ఏం మాట్లాడినా కేసులు పెడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకులపై వాఖ్యలు చేసిన టీఆర్ఎస్ పై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Worse in Narsinghi: నార్సింగీ లో దారుణం.. మద్యం తాగించి కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్

Exit mobile version