Site icon NTV Telugu

Peace Committee: మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకి అప్పగించండి

Peace Commetee

Peace Commetee

Peace Committee: ఛత్తీస్గఢ్లో మే 21వ తేదీన జరిగిన ఎన్ కౌంటరులో చనిపోయిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా మిగతా మావోయిస్టులందరి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పాలని పీస్ కమిటీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మృతదేహాల అన్నింటిని వారి కుటుంబాలకు వెంటనే అందజేయాలన్నారు. మృతుల గౌరవానికి సంబంధించిన రాజ్యాంగ, న్యాయపరమైన, అంతర్జాతీయ బాధ్యతలను పూర్తిగా అమలు చేయాలని కోరారు. ఇక, పీస్ కో ఆర్డినేషన్ కమిటీ తరఫున ప్రొ.హరగోపాల్, ప్రొ.జి లక్ష్మణ్, డా. ఎం.ఎఫ్. గోపినాథ్, కవితా శ్రీవాత్సవ, క్రాంతి చైతన్య, మీనా కందసామి ఈ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

Read Also: Monsoon : తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

అయితే, మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత వారి కుటుంబీకులకు అప్పగిస్తామని ఛత్తీస్ గఢ్ అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు వాటిని అప్పగించలేదని ఇది ఆందోళనకరం అని పీస్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మృతదేహాలతో గౌరవప్రదంగా వ్యవహరిచాలనే హక్కు ఉల్లంఘిస్తున్నారు.. గౌరవంగా భద్రపరచాలనే స్పష్టమైన చట్టపరమైన బాధ్యత ఉన్నప్పటికీ వాటిని కోల్డ్ స్టోరేజ్ లో భద్ర పర్చకుండా కుళ్లిపోయేలా వదిలేశారనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తోందని పీస్ కమిటీ పేర్కొంది.

Read Also: PSL 2025 Final: పీఎస్ఎల్ ఫైనల్ కోసం 6 వేల కిమీ జర్నీ.. ఫ్లైట్ డబ్బులు వృధా కాలే!

ఇలా వ్యవహరించడం వైద్య, చట్టపరమైన ప్రోటోకాల్ ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పీస్ కమిటీ పేర్కొనింది. అయితే, మరణించిన వ్యక్తితో అమానవీయంగా వ్యవహరించడం, విషాదంలో ఉన్న కుటుంబాలకు మరింత మానసిక ఆందోళనను కలిగించడమేనని ఆరోపించింది. అంత్యక్రియల ఊరేగింపుల వల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందని పేర్కొంటూ ఇద్దరి మృతదేహాలను అప్పగించడాన్ని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించడం మాకు చాలా బాధ కలిగించిందని అన్నారు. సంతాపాన్ని నేరంగా పరిగణించే ఈ సమర్థన దుర్మార్గమైనదని.. రాజ్యాంగానికి వ్యతిరేకమని తెలిపారు. అంతిమ సంస్కారాలు చేయడానికి తాము ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉండటానికి రెడీగా ఉన్నానమని మరణించిన మావోయిస్టు కుటుంబాలు కోర్టుకు తెలిపినా.. ఇంకా మృతదేహాలను వారికి అప్పగించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పీస్ కమిటీ వెల్లడించింది.

Exit mobile version