NTV Telugu Site icon

PDSU Leaders: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. విద్యారంగం సమస్యలపై పీడీఎస్‌యూ నిరసన..

Pdsu

Pdsu

PDSU Leaders: అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ రాష్ట్ర సమితి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు పెద్దఎత్తున అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు.

Read also: MLC Kavitha: ఆ.. వీడియోలు చూస్తే ప్రభుత్వం చెబుతుంది అవాస్తమని అర్థమవుతుంది..

ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్‌ పాయిజన్‌ ​​ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, బడ్జెట్‌లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని, కార్పొరేట్‌ కాలేజీల మూసివేత ఆపాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. పీడీఎస్‌యూ సంఘం నేతలను అసెంబ్లీ వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సభా ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read also: Thiru Manickam : క్రిస్మస్ కానుకగా సముద్రఖని సినిమా రిలీజ్

మరోవైపు ఇందిరా పార్క్ వద్ద గ్రామపంచాయతీ సెక్రటరీల ఆందోళన చేపట్టారు. ఆందోళన అనుమతించి చివరి క్షణంలో అధికారులు రద్దు చేశారు. ఇందిరాపార్క్ చౌరస్తాపై గ్రామపంచాయతీలు ఆందోళనకు దిగారు. వేతన పెంపుతోపాటు.. బకాయిలు చెల్లించాలని గ్రామపంచాయతీ సెక్రటరీలు ఆందోళనకు దిగారు. దీంతో ఇందిరాపార్క్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది.
Minister Sridhar Babu: ఐటీ రంగమనేది టాలెంట్ ఆధారంగా నడుస్తుంది..

Show comments