Mahesh Kumar Goud: బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటే.. ఇదంతా అమిత్‌షా డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని.. ఇదంతా అమిత్‌షా నడుపుతున్న డ్రామా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కెమెరా ముందు విమర్శలు చేసుకుంటున్నట్టు ఆ రెండు పార్టీలు నటిస్తున్నాయని.. తెరవెనుక చాలా తతంగాలు నడుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు చేస్తోన్న అమిత్‌షా.. ఆయనకు ఈడీ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఒకవేళ బీజేపీకి 10 నుంచి 15 సీట్లు వస్తే తాను రాజకీయాలు మానేస్తానని ఛాలెంజ్ చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ‘ధరణి’ తీసుకొచ్చాక రైతులు ఆగం అవుతున్నారని మహేష్ గౌడ్ విమర్శించారు. 2014 తర్వాత కేసీఆర్ కుటుంబ ఒక్కటే బంగారుమయమైందని అన్నారు. ఆదిలాబాద్‌లో వందల ఎకరాల్ని అడ్డగోలుగా కొన్నారని ఆరోపించారు. భూమికి, పేదవాడికి అనుబంధ సంబంధం ఉందని.. కాంగ్రెస్‌కి కూడా భూమితో సంబంధం ఉందని పేర్కొన్నారు. సీలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి, లక్షల ఎకరాల్ని పంచిన ఘనత తమ కాంగ్రెస్ పార్టీదేనన్నారు. తెలంగాణ సంపదని కేసీఆర్ కొల్లగొడుతున్నారని చెప్పిన మహేష్ గౌడ్.. కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టారని ధ్వజమెత్తారు.
Also Read
- Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
- CJP Protest: నేడు హైదరాబాద్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ధర్నా.. సోనమ్ వాంగ్‌చుక్ హాజరు!
- Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ - మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
- OTR : కవిత కొత్త పార్టీకి టిఆర్ఎస్ టైటిల్ ఉంటుందా ఉండదా.. పార్టీ పేరు మారుతుందా?
కిరాయి కార్లలో తిరిగే కేసీఆర్ కుటుంబానికి.. ఇప్పుడు వందల కోట్ల కార్లు ఎక్కడి నుంచి వచ్చాయని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన కమిషన్ డబ్బుల్ని భూములపై పెట్టుబడి పెట్టి, కేసీఆర్ లక్షల కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యని తీర్చడంతో పాటు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
-
The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్… విజయ్ దేవరకొండ గొప్ప మనసు
-
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
-
Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!