సంచలనంగా మారిన రేవంత్ వ్యాఖ్యలు.. సర్కార్‌ను రద్దు చేస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేస్తారన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్‌లా తనకు గాలివాటంలా ఉద్యోగం రాలేదని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. పొత్తులో కేటీఆర్ కి టికెట్ ఇచ్చినప్పుడు ఎంతకి కొన్నారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అన్నారు. అలాగే ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ ప్రభుత్వంలో హరీష్‌రావు మంత్రి అయ్యారన్నారాయన. హరీష్‌రావు బతుకే కాంగ్రెస్ అని.. టీడీపీని విమర్శిస్తూనే ఎల్ రమణను టీఆర్‌ఎస్‌లోకి ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు రేవంత్. కాంగ్రెస్ మొదటి శత్రువని చెప్పిన కేసీఆర్… కుటుంబంతో వెళ్లి సోనియా కాళ్ల మీద పడలేదా అన్నారు. కేసీఆర్ టీఆరెస్‌కి ఎలా అధ్యక్షుడో కాంగ్రెస్‌కు తాను అధ్యక్షుడిని అన్నారు రేవంత్ రెడ్డి. అలాగే టీఆర్‌ఎస్‌లో 75 శాతం టీడీపీ నుంచి వచ్చినవాళ్లేనని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా టీడీపీనే టీఆర్‌ఎస్‌కు దిక్కయిందన్నారు. కేటీఆర్‌కు పౌరుషం ఉంటే… ఆంధ్ర నాయకుడి పేరు మార్చుకోవాలని సవాల్ విసిరారు. తాను బాబు మనిషి అయితే కేసీఆర్ కూడా చంద్రబాబు మనిషేనన్నారు. అలాగే కేటీఆర్, హరీష్ లను ఉద్దేశించి బావా బావమరుదులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిని అయినందుకు ప్రపంచానికే అధిపతి అయినట్టుగా సంతోషపడతానని మీకేంటి నొప్పంటూ ప్రశ్నించారు రేవంత్. దీంతో.. కొత్త చర్చ మొదలైంది.. గతంలో ముందస్తు ఎన్నికలు వెళ్లిన కేసీఆర్.. మరోసారి అదే పనిచేస్తారా? లేక వన్ నేషన్ వన్ ఎలక్షనే కారణం అవుతుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!