Site icon NTV Telugu

Revanthreddy: కేటీఆర్ తప్పు చేస్తే మంత్రి పదవి.. విద్యార్థులు తప్పు చేస్తే మన్నించలేవా?

Revanth Reddy Agnipath

Revanth Reddy Agnipath

కేటీఆర్ తప్పులు చేస్తే.. మంత్రి పదవి ఇచినావు ! విద్యార్దులు తప్పు చేస్తే..మన్నించలేవా..? అంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ.. అగ్ని పథ్ తెచ్చి దేశ భద్రతను చీకట్లో కి నెట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసులకే తొమ్మిది నెలలు శిక్షణ తీసుకుంటారు అలాంటిది సైనికుల కు అరు నెలల శిక్షణ ఏం సరిపోతుందని ప్ర‌శ్నించారు. కోటి జనాభా లేని ఇజ్రాయిల్ తో మన దేశంని పోల్చడం ఏంటని మండిప‌డ్డారు రేవంత్‌. అది బీజేపీ నేతల మూర్ఖత్వమ‌ని విమ‌ర్శించారు. నాలుగేండ్లు శిక్షణ చేసి వచ్చిన వాడికి ఏం పని చేస్తారు, పిల్లనిచ్చేది ఎవరంటూ నిప్పులు చెరిగారు. మాజీ సైనిక హోదా కూడా ఇవ్వకపోతే ఎట్లా అంటూ ప్ర‌శ్నించారు. ఆయుధం శిక్షణ పొందిన తర్వత.. తీవ్రవాదం వైపు వెళ్తే బాధ్యులు ఎవరు..? అంటూ నిల‌దీశారు రేవంత్ రెడ్డి. పక్కదారి పడితే దేశం ప్రమాదంలో పడదా..? అంటూ ప్ర‌శ్నించారు.

మోడీ..కెసిఆర్ లు అధికారంలో ఉండటంతో యువకుల జీవితాలు గందర గోళం లోకి నెట్టారంటూ మండిప‌డ్డారు. సికింద్రాబాద్ లో ఆందోళన చేస్తే.. జైల్లో పెట్టారు. చనిపోయిన రాకేష్ కి శవ యాత్ర చేశారు. టీఆర్ ఎస్‌ పార్టీ జెండాలు కట్టీ మంత్రులు శవ యాత్ర కి పోటీ పడ్డారంటూ విమ‌ర్శించారు రేవంత్‌. ఆ తర్వాత పట్టించుకోవ‌డం మానేసార‌ని మండిప‌డ్డారు. జైల్లో అరవై మంది నీ పెడితే పట్టించుకోలేదని దానితోడు రాష్ట్రం కూడా కేసులు పెట్టిందని విమ‌ర్శించారు. దేశం కోసం కలలు కన్న విద్యార్దులను నేరగాళ్లు చేసిందని మండిప‌డ్డారు. 307 సెక్షన్ కింద కేసులు పెట్టిందని ఆగ్ర‌హం వ్య‌క్త చేశారు.

ఎవరిని చంపడానికి వెళ్ళారు అని కేసు పెట్టారు? అంటూ ప్ర‌శ్నించారు రేవంత్ రెడ్డి. దేశం కాపాడాలని చూసిన వాళ్ళను నేరగాళ్లు గా చిత్రీకరించే కుట్ర చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. నేరానికి పాల్పడిన వాళ్ళ ను శిక్షించూ.. కానీ అమాయకులను వదిలేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టీ విచారణ చేయాలని డిమాండ్ చేసారు. మోడీ మీద యుద్ధం అన్నారు కెసిఆర్.. మ‌రి ఎక్కడ పడుకున్నాడు అంటూ ఎద్దేవ చేశారు. అగ్ని పథ్‌ రద్దు చేయాలని ఎందుకు అడగ‌డంలేదంటూ మండిప‌డ్డారు. కేటీఆర్ ఢిల్లీలో ఉన్నాడు. రక్షణ మంత్రి..ప్రధానికి కలిసి అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరాలని రేవంత్ అన్నారు. జైల్లో ఉన్న తల్లిదండ్రులకు మాట ఇస్తున్న… సికింద్రాబాద్ కేసులో అరెస్ట్ అయిన పిల్లలకు.. కుటుంబాలకు అండగా పార్టీ ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బెయిల్..వకాలత్.. పూచికథ్ అంతా మేమే చూసుకుంటామ‌ని అన్నారు. మీరు ఎవరు ఆందోళన చెందకండి .. అగ్ని పథ్‌ రద్దు చేయాలి.. యువతకు క్షమాపణ చెప్పాలని రేవంత్ ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేసారు.

 

Exit mobile version