MLA Dharma Reddy: తెలంగాణ అంతా మన వైపు చూసేలా భారీ మెజారిటీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం అని చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్ర నడికుడ మండలంలోని చౌటుపర్తి గ్రామంలోఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరకాల నియోజకవర్గ సిఎం కేసీఆర్ గారి సహకారంతో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. మరొక్కసారి ప్రజలంతా దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. మూడవసారి అధికారంలోకి రాగానే మరిన్ని పథకాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు వేస్తే గ్రామాలు అంధకారంగా మారుతాయని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తే కాంగ్రెస్ నాయకులు ఎందుకని ఎద్దేవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తానని చెప్పారు. దానికి కూడా మీటర్లు పెట్టి కరెంటు బిల్లు వసూలు చేస్తారన్నారని తెలిపారు. రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడి కింద ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని 16 వేలకు పెంచడం జరుగుతుందని గుర్తు చేశారు.
Read also: Nepal : నేపాల్లో పెరిగిన హిందూ రాష్ట్ర డిమాండ్.. అల్లకల్లోలం అక్కడ
భారతదేశంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైనా గుజరాత్ లో 700 రూపాయలు పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. ఇక్కడ 2016 రూపాయలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే 4000 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. బీడీ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆడపడుచులకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని సూచించారు. ఇప్పటికే సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. చిన్న గ్రామాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. మన పరకాల మరింత అభివృద్ధి చెందాలన్నా తెలంగాణ అంతా మన వైపు చూసేలా భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mohan Bhagwat: ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం.. అందరినీ ఆర్యన్లను చేస్తాం..