NTV Telugu Site icon

Palvai Sravanthi: 14న నామినేషన్, ప్రజలనుంచి అనూహ్య స్పందన

Tpcc

Tpcc

మునుగోడులో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. గాంధీభవన్లో మునుగోడు సమీక్ష ముగిసింది. ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సభలు వుంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 14న నామినేషన్ వేయనున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. ప్రజల నుంచి సానుకూల స్పందన ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రచారానికి వస్తారు. ఆయన నాకు మాటిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రచారానికి వస్తానని వెంకటరెడ్డి చెప్పారు. ఈనెల ఏడవ తేదీన మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ను ఎలక్షన్ కమిషన్ జారీ చేయనుంది.

Read Also: Suryalanka: సూర్యలంక తీరంలో విషాదం.. ముగ్గురు మృతి

ఈనెల 14 వరకు నామినేషన్లు స్వీకరించనున్న ఎన్నికల కమిషన్.. 15వ తేదీన స్క్రూటీని చేస్తారు.. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుండగా…. నవంబర్ 6న మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.ఎలాగైనా ఆ స్థానంలో గెలవాలని పట్టుదలతో ఉంది. అటు బీజేపీ కూడా రాజగోపాల్ రెడ్డిని గెలిపించి నలుగురు ఆర్ లను అసెంబ్లీలో వుంచాలనుకుంటోంది. టీఆర్ఎస్ మాత్రం ఎలాగైనా కాంగ్రెస్ సీటుని కైవసం చేసుకుని హుజూర్ నగర్ ఫలితాన్ని రిపీట్ చేయాలని భావిస్తోంది. అయితే దుబ్బాక, హుజూరాబాద్ లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని భావిస్తోంది. దీనికి తోడు జాతీయ పార్టీ హడావిడిలో పార్టీ నేతలు బిజీగా వున్నాయి. అయితే ఉప ఎన్నికపై దాని ప్రభావం పడకుండా చూస్తానంటున్నారు సీఎం కేసీఆర్.

Read Also: Rashmika Mandanna: విజయ్ తో లిప్ లాక్.. ఆ బాధను తట్టుకోలేకపోయా

బీజేపీ, టీఆర్ఎస్ లు తమ మధ్యే ప్రధాన పోటీ అని చెబుతున్నా.. అంతిమంగా ఉప ఎన్నికల్లో వచ్చే ఓట్లు మాత్రం కాంగ్రెస్ పై ప్రభావం చూపుతాయి. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే జరిగింది. కానీ ఫలితాలు వెలువడ్డాక ఆ ప్రభావం ఎక్కువగా కాంగ్రెస్ మీదే కనిపించింది. కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఢీలాపడ్డాయి. అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చెప్పుకోదగ్గ ఓట్లు సాధించాలని, గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నేతలకు సూచించింది. కాంగ్రెస్ లో ఐక్యతా రాగం వినిపించి. మునుగోడులో ఎన్ని ఓట్లు సాధిస్తారో చూడాలి.