NTV Telugu Site icon

Munugode Bypoll: భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టించిన పాల్వాయి స్రవంతి..

Palvai Sravanthi

Palvai Sravanthi

మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్‌ పెంచుతున్నాయి.. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వానికి ఇవాళ్టితో తెరపడింది.. దాదాసు 90 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది.. చివరి రోజు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేశారు.. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.. విస్తృతంగా ప్రచారం.. సభల్లో.. కార్యకర్తలతో.. ప్రజలతో మాట్లాడడంతో.. ఆమె గొంతు బొంగురుపోయింది. గద్గద స్వరంతో తండ్రిని గుర్తుకు తెచ్చుకుంది. తన నియోజకవర్గంలోని ప్రజలతో ఆడబిడ్డను వచ్చాను. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకోండి అంటూ ఆమె మాట్లాడిన మాటలు మునుగోడు ప్రజల గుండెను తడిమాయి.

Read Also: Kerala: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే

నామినేషన్ అనంతరం.. పార్టీ శ్రేణులను.. ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతుండగా ఆమె గొంతు బొంగురుపోయింది. కంటతడి పెట్టింది. తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ.. ఈరోజు నాన్నలేని లోటు నాకు తెలుస్తుందని కన్నీరు మున్నీరయ్యారు. ఇక్కడ ఉన్న మీరందరూ నా తోబుట్టువులై, నా తండ్రిస్థానం తీసుకుని, నాతోపాటు నడవాలని నా చేతులు చాచి, నా కొంగు చాచి ప్రాదేయపడుతున్నాను. మీ ఒక్క ఓటు, మీ ఒక్కటే ఒక్క ఓటు ఈసారి ఈ ఎన్నికల్లో నాకే వెయ్యాలని కోరుతున్నా అంటూ గద్గదస్వరంతో మాట్లాడటం అక్కడికి వచ్చిన ప్రజల గుండెను తడిమింది… భావోద్వేగానికి లోనైన పాల్వాయి స్రవంతి.. ఆమె కన్నీరు పెడుతూ చేసిన వ్యాఖ్యలు.. అక్కడున్నవారి గుండెను తడిపి.. వారితో కూడా కన్నీరు పెట్టించాయి.