నేటి నుంచి పల్లె గోస- బీజేపీ భరోసా యాత్రను చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ముందు ఆరు నియోజకవర్గాల్లో ఈ బైక్ ర్యాలీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు కలిపి మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మొదటి విడతలో 13 నియోజకవర్గాల్లో చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే నేడు(గురువారం) 6 నియోజకవర్గాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. అయితే మిగతా నియోజకవర్గాల్లో ఒకట్రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ వేములవాడలో ఈబైక్ ర్యాలీని ప్రారంభిస్తారని, ఆతరువాత సిద్దిపేటలో చేపట్టే ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే.. ఈ పల్లె గోస బీజేపీ భరోసా యాత్ర దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు చేపడుతున్నారు.
చేవెల్ల తాండూరు నియోజకవర్గంలో డీకే అరుణ పర్యటన
సిద్దిపేటలో మురళీధర్ రావు,
బోధన్ లో ఎమ్మెల్యే రాజాసింగ్
నర్సంపేటలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు
జుక్కల్ లో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి
వేములవాడలో ఎండల లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహింస్తారు.
read also: Sonia Gandhi: నేడు ఈడీ ముందుకు సోనియాగాంధీ.. దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
ఒకట్రెండు రోజుల్లో చేపట్టే ఏడు నియోజకవర్గాల్లో పర్యటన
దేవరకద్రలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్
ఆదిలాబాద్ లో ఎంపీ అర్వింద్
వైరాలో ఎంపీ సోయం బాపురావు
దేవరకొండలో గరికపాటి మోహన్ రావు
మేడ్చల్ లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
ఇబ్రహీంపట్నంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కల్వకుర్తిలో మాజీ మంత్రి బాబు మోహన్ పర్యటించనున్నారు.
రాష్ట్రంలో ప్రజలకు ఇస్తామని చెప్పి నెరవేర్చని హామీలపై పోరాటం చేస్తామని, ఫసల్ భీమా, డబుల్ ఇండ్లు , నిరుద్యోగం, ఇతర అంశాలపై ప్రజల ఇబ్బందులను తెలుసుకుని ప్రజలకు తామున్నామనే భరోసా కల్పిస్తామని , నియంతృత్వ టీఆర్‌ఎస్ పాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని , ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు నిచ్చారు.
Saibaba Chalisa Live: గురువారం సాయి చాలీసా పారాయణం చేస్తే…