NTV Telugu Site icon

హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై..!

కామాంధులు రెచ్చిపోతున్నారు.. ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి వార్తలు వినవాల్సి వస్తుందో అనే ఆందోళనక కలిగించే పరిస్థితి నెలకొంది.. ఇక, ఈ మధ్య వరుసగా హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న దారుణమైన ఘటనకు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. రాజేంద్రనగర్ హైదర్‌గూడలో అభం శుభం తెలియని బాలికపై అత్యాచారయత్నం చేశాడో గుర్తుతెలియని యువకుడు. బాలిక కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్న స్థానికులు.. కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, అరెస్ట్‌లు, శిక్షలు పడుతున్నా.. చిన్నారులు, వృద్ధులు.. అనే తేడాలేకుండా.. వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది.