Site icon NTV Telugu

MLA Seethakka Doctorate: ఎమ్మెల్యే సీతక్కకు ఓయూ డాక్టరేట్..

Mla Seethakka Doctorate

Mla Seethakka Doctorate

MLA Seethakka Doctorate: ఎమ్మెల్యే సీతక్కకు ఓయూ డాక్టరేట్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించారు. ఓయూ మాజీ ఛాన్సలర్, మణిపూర్ సెంట్రల్ వర్సిటీ ఛాన్స్లర్ ప్రొ. తిరుపతిరావు పర్యవేక్షణలో.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గొత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై పొలిటికల్ సైన్స్లో ఆమె పరిశోధన పూర్తి చేశారు. సీతక్క సమర్పించిన సంబంధిత గ్రంథాన్ని పరిశీలించిన అధికారులు ఆమెకు పీహెచీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

Read also: Venkaiah Naidu: రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి… శత్రువులు కాదు

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. తన చిన్నతనంలో నేనెప్పుడూ నక్సలైట్ అవుతానని అనుకోలేదు, నక్సలైట్‌గా ఉన్నప్పుడు లాయర్ అవుతానని, లాయర్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీహెచ్‌డీ చేస్తానని అనుకోలేదని సీతక్క అన్నారు. ఇప్పుడు మీరు నన్ను డాక్టర్ అనుసూయ సీతక్క పీహెచ్‌డీ అని పిలవవచ్చంటూ అక్కడంతా కాసేపు నవ్వులు పూయించారు సీతక్క. ప్రజలకు సేవ చేయడం, జ్ఞానాన్ని పొందడం,, నా అలవాటు,, నా చివరి శ్వాస వరకు నేను దీన్ని ఎప్పటికీ ఆపనని అన్నారు. తన పిహెచ్‌డి గైడ్ ప్రొఫెసర్ టి.తిరుపతి రావు సార్ మాజీ వీసీ ఉస్మానియా విశ్వవిద్యాలయం, ప్రస్తుత మణిపూర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్, హెచ్‌ఓడి ప్రొఫెసర్ ముసలయ్య , ప్రొఫెసర్ అశోక్ నాయుడు , బిఓఎస్. ప్రొఫెసర్ చంద్రు నాయక్ అని తెలిపారు. పొలిటికల్ సైన్స్‌లో తన పీహెచ్‌డీ టాపిక్‌ను పూర్తి చేయడానికి తన పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నారు సీతక్క.
Satyavathi Rathod: రాజగోపాల్ కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి వెళ్లారు

Exit mobile version