Kishan Reddy : నక్సలిజం నిర్మూలనలో కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజం హింసను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ లో భాగంగా వందలాదిమంది నక్సలైట్లు హింస మార్గాన్ని వదిలి సాధారణ జనజీవనంలో కలవడాన్ని కిషన్ రెడ్డి స్వాగతించారు.
గత మూడు రోజుల్లోనే 300 మందికి పైగా నక్సలైట్లు అధికారాల వద్దకు వచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ లొంగుబాటులో ఎక్కువ మంది తెలుగువారూ ఉండడం ప్రత్యేకత అని చెప్పారు. “ఇంతకాలం నక్సలిజం ప్రభావిత ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండగా, నేడు ఈ ప్రాంతాలు చీకటినుంచి వెలుగుకు అడుగులు వేస్తున్నాయి. దీన్ని సంతోషంగా చూస్తున్నాం” అని ఆయన చెప్పారు. దశాబ్దాల క్రితం దేశంలో 125 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఉన్నప్పటికీ, నేటికి వాటిని 11 వరకు తగ్గించడంలో కేంద్రం విజయం సాధించిందని పేర్కొన్నారు. మిగిలిన 11 జిల్లాలు కూడా త్వరలో నక్సల్ రహితంగా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా.. “అంబేద్కర్ గారి రాజ్యాంగం హింసకు చోటు ఇవ్వదు. అహింసా మార్గంలోనే ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చు. రక్తపాతం ద్వారా ఏదీ సాధించలేమని మరోసారి స్పష్టమైంది” అన్నారు. నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో ఇంతకాలం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం సడలిపోలేదు. అయితే ఇప్పుడు, నక్సల్ రహిత జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.
Pakistan HS-1 Satellite: డ్రాగన్ నేల పైనుంచి దాయాది గూఢచారి ఉపగ్రహ ప్రయోగం!
