NTV Telugu Site icon

Karimnagar: ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు.. మిరియాల పేరుతో పుప్పొడి విత్తనాలు

Karimnagar Food

Karimnagar Food

Karimnagar: ఫుడ్ కోసం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా, కొన్ని రెస్టారెంట్లు అర్థరాత్రి లేదా తెల్లవారుజామున అనే తేడా లేకుండా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఇలా బయట ఫుడ్ ఆర్డర్ చేసే చాలా మంది పెద్ద పెద్ద రెస్టారెంట్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పది రూపాయలకు మించి ఖరీదు చేసినా.. నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడంలో పేరున్న రెస్టారెంట్లకే ప్రాధాన్యం ఇస్తారు. మరి రెస్టారెంట్లు, హోటళ్లు తమ కస్టమర్లకు నిజంగా కల్తీ లేని నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాయా లేదా అన్నది ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన పరిశోధనల్లో తేలింది. కరీంనగర్‌లోని పలు హోటళ్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. వరంగల్ నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ సేఫ్టీ విభాగం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీతో పాటు పలువురు అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు.

Read also: Raghunandan Rao: బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయి..

ఆకస్మిక దాడులతో… ఒక్కసారిగా హోటళ్ల యజమానులు భయాందోళనకు గురయ్యారు.. హోటళ్లలోని కఠోర నిజాలు బయటపడ్డాయి. మిరియాల పేరుతో పుప్పొడి విత్తనాలు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. 2021-22 మధ్య కాలంలో పదార్థాలను సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగించడంపై అధికారులకు అనుమానం వచ్చింది. ఇదంతా ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో వెల్లడైంది. కల్తీ నూనెలు, కాలం చెల్లిన వంట సామాగ్రి, మసాలాలు గుర్తించి హోటల్ యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని హోటళ్లలో సాయంత్రం వరకు ఈ తనిఖీలు చేస్తామని.. ఫుడ్ సేఫ్టీ చట్టాల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని అమృతశ్రీ తెలిపారు.
IT Rides : జ్యువెలర్స్‌పై ఐటీ దాడులు.. భారీగా లెక్కల్లో చూపని సొత్తు..