PCC Political: గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ కు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి. హనుమంతరావు తదితరులు వచ్చారు. అయితే, కాంగ్రెజ్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్ లుగా పని చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కునర్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు చెపుతూ తీర్మానం చేశారు. దీంతో ఆ తీర్మానాన్ని సమావేశంలో ప్రవేశ పెట్టగా ఏకగ్రీవంగా సభ్యులు ఆమోదం తెలిపారు.
Read also: CM Jagan: పేదవారికి ఖరీదైన వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం..
కాగా.. విద్యుత్ పై సమీక్ష కారణంతో పీసీసీ పొలిటికల్ కమిటీ సమావేశం నుంచి సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికలపై సన్నాహకంపై చర్చ కొనసాగుతుది. . ఆరు గ్యారంటీల అమలుపై నేతల చర్చ చేస్తున్నారు. వెంటనే ఆరు గ్యారెంటీలు అమలులోకి తేవాలని నేతలు సూచించారు. పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన కార్యకర్తలకు పీఏసీ ధన్యవాద తీర్మానం చేశారు. ఇక మానిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను, హామీలను ప్రజలు పూర్తిగా విశ్వసించారని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. మంచి విజయాలు అందేలా మనం కష్టపడి పని చేయాలన్నారు. ఇక మరోవైపు సూర్యాపేట జిల్లా అధికారులతో సమీక్ష కారణంగా సచివాలయం ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలు దేరారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతుండగా భట్టి, ఉత్తమ్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
Rajasthan : పాఠశాలకు వెళ్తున్న 13 ఏళ్ల బాలిక కిడ్నాప్.. రాత్రంతా సామూహిక అత్యాచారం