TS One-Time Schools: తెలంగాణలో నేటి నుంచే ఒంటిపూట బడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS One-Time Schools: నేటి నుంచి తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఈనెల 15 నుంచి ఒంటి పూట బడలు నిర్వహించాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆమె తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, మధ్యాహ్న భోజనం అందించిన తర్వాతే పిల్లలను ఇంటికి పంపించాలని ఆదేశించారు.
Read also: Ramadan Iftar Feast: నేడు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం రేవంత్
Also Read
కాగా.. ఈ నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నందున పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి పాఠశాలలకు ఏప్రిల్ 23ని చివరి పని దినంగా విద్యాశాఖ నిర్ణయించింది. అప్పటి వరకు కలిసి భోజనాలు చేస్తారు. ఈ సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
Read also: BS Yediyurappa: మైనర్‌పై మాజీ సీఎం లైంగిక వేధింపులు..పోక్సో కేసు నమోదు..
ఈ నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు సహా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్షల పర్యవేక్షణకు విద్యాశాఖ, రెవెన్యూ శాఖ నుంచి ఒక్కో అధికారి, ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించనున్నారు. ఈసారి అన్ని కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు తప్పుడు ప్రశ్నపత్రాలు జారీ చేస్తే ఇన్విజిలేటర్లను బాధ్యులను చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిపారు.
RBI : రెండు ప్రైవేట్ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ నిలిపివేత
తాజావార్తలు
-
Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
-
Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
-
Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
ట్రెండింగ్
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!