Site icon NTV Telugu

Breaking : మరో నోటిఫికేషన్‌ విడుదల చేసిన తెలంగాణ సర్కార్‌..

ts govt

ts govt

తెలంగాణ సర్కార్‌ వరుసగా నోటిఫికేషన్‌లను విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలీస్‌ శాఖలో ఉద్యోగాల భర్తీ, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 ఉద్యోగాల భ‌ర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ.. నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది. ఇందులో.. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌(ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల 614కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

Exit mobile version