ED Notices: రేపు విచారణకు రావాలి.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Once again ED notices for MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు (సెప్టెంబర్ 15) విచారణకు హాజరు కావాలని తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారిన తర్వాత మరోసారి కవితను విచారణకు పిలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తాను కవిత బినామీనని అరుణపిళ్లై గతంలో ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరా, రామచంద్ర పిళ్లై అప్రూవర్లుగా మారారు. దీంతో కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారనుంది. కవిత ఇప్పటికే ఒకసారి ఈడీ విచారణకు వెళ్లింది. ఈ ఏడాది మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు రోజుల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు.
Also Read
ఆ సమయంలో ఉదయం ఈడీ కార్యాలయానికి వెళ్లిన కవిత రాత్రి వరకు ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఆమె ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. తనపై విచారణ జరుగుతున్న తీరుపై ఆమె సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. అప్పట్లో కవిత అరెస్ట్ కాబోతోందని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత కేసు చల్లబడింది. తాజాగా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. ఈడీ నోటీసులు అందుకున్న కవిత రేపు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఆమె రేపు విచారణకు హాజరుకావడం అనుమానమే. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై సీఎం కేసీఆర్ తో చర్చించి కవిత హాజరుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Amazon: ఈ తేదీ నుంచి ఆర్డర్ల డెలివరీకి రూ. 2000 నోటును అంగీకరించదు..
తాజావార్తలు
-
AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
-
Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
-
Buchibabu : ‘మ్యూజిక్’ అనడమే రాని స్థితి నుండి.. రెహమాన్ పక్కన కూర్చునే వరకు!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Trinamool Congress: చీలిక దిశగా మమత పార్టీ.. 50 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై..!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!