మరోసారి బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. నిన్న టీఆర్‌ఎస్ పార్టీ 21వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగాయి. ఈ ప్లీనరీ సమావేశాల్లో 13 కీలక తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తీర్మానాలపై బీజేపీ నేతల నుంచి సమాధానం లేదని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లు, నవోదయ విద్యాలయాలలతో పాటు ఏ ఒక్క అంశంపై బీజేపీ నేతల వైపు నుంచి సమాధానం లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండ బీజేపీది సంగ్రామ యాత్ర…పాపాల యాత్ర.. అని ఆయన ఎద్దేవా చేశారు.
ఇది కమలం పార్టీ కాదు…కార్పోరేట్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. మీ డబుల్ ఇంజన్‌కు దేశ ప్రజలు ఎర్రజెండా చూపిస్తారని, 11 లక్షల కోట్ల బకాయిలు కేంద్ర సర్కార్ కార్పోరేట్ దుస్తుల కోసం మాఫీ చేశారన్నారు. బీజేపీ నేతృత్వంలో వివిధ రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీలో ఎంత మంది కేంద్ర మంత్రుల పిల్లలు ఎంపీలు గా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఇప్పడు కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు అని మాట్లాడడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.
