కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హైదరాబాద్‌లో ఎంటరైంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్టు తెలంగాణ వైద్య శాఖ ప్రకటించింది.. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించడం.. వారికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఎంట్రీతో అప్రమత్తం అయ్యారు అధికారులు.. ఇక, ఆ ఇద్దరూ మొహిదీపట్నం టోలీచౌకీ ప్రాంత వాసులే కావడంతో.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్‌పై ఫోకస్‌పెట్టారు.
Read Also: కేంద్ర మంత్రిపై రాహుల్ నిప్పులు.. అజయ్ మిశ్రా ఓ క్రిమినల్..!
ప్రస్తుతం టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీ.. ఒమిక్రాన్‌తో ఉలిక్కిపడింది… అక్కడ విస్తృతంగా టెస్ట్‌లు చేస్తున్నారు.. దీని కోసం 25 హెల్త్ టీమ్స్‌ను రంగంలోకి దించారు అధికారులు.. 700 ఇళ్లలో ఉన్న జనాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఇప్పటి వరకు 136 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు పూర్తి చేశారు.. మరో 36 గంటల తర్వాత ఆ టెస్ట్‌లకు సంబంధించిన ఫలితాలు రానుండగా… ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్‌గా తేలితే.. సదరు వ్యక్తుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కి పంపనున్నారు. ఆ తర్వాతే.. వారికి సోకింది కోవిడా..? లేదా ఒమిక్రాన్ వేరియంటా? అనేది తేలిపోనుంది.. మొత్తంగా.. ఒమిక్రాన్ టెన్షన్ ఇప్పుడు టోలీచౌకీ వాసులను కలవరపెడుతోంది.
