ప్రస్తుతం వరి కొనుగోలుకి ఇబ్బందులు పడుతున్న వేళ రైతులు వరి పంటకు బదులు ఆయిల్ పాం పంట సాగు వైపు దృష్టి సారిస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చు. నిత్యం సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే ఆయిల్ పాం సాగు చేయడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరం తర విద్యుత్ సరఫరా వల్ల ఈ సదుపాయాన్ని రైతాంగం వినియోగించుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు.
ఆయిల్ పాం పంట సాగు చేసే రైతుల కోసం ఫ్యాక్టరీ నిర్వాహకుల సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సడ్సిడీ అందిస్తుంది. ఆయిల్ పాం పంట నాలుగేళ్లలో చేతికి వస్తుందని పంటలో అంతర్ పంటల సాగు అనుకూలమని నాలుగేళ్లలో లక్షలాది రూపాయలు ఈ పంట సాగు ద్వారా పొందవచ్చు. దీంతో తెలంగాణలో సాగునీరు అధికంగా లభించేచోట ఆయిల్ పాం సాగు అధికంగా సాగుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు పైగా భూములు ఆయిల్ పాం సాగుకు అనుకూలం. రైతులకు ఎకరానికి ఏటా రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు లాభం రానుంది.అందుకే రైతులు ఈ మధ్యకాలంలో ఆయిల్ పాం వైపు మొగ్గుచూపుతున్నారు.
