Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Congress

Off The Record : తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం ప‌ట్టు సాధించిందా..? లేదా..?

Published Date :August 2, 2024 , 10:35 pm
By Gogikar Sai Krishna
Off The Record :  తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం ప‌ట్టు సాధించిందా..? లేదా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ అసెంబ్లీలో అధికారపక్షం పైచేయి సాధించగలిగిందా? ఇన్నాళ్ళు పట్టు విడుపులతో నడిచిన సభ క్రమంగా ఏకపక్షం అవుతోందా? ఆ విషయమై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఎక్కడ విపక్షాన్ని డామినేట్‌ చేయగలిగింది అధికార పక్షం? మెయిన్‌ అపోజిషన్‌ ఎక్కడ కార్నర్‌ అయింది? అందులో కీలక పాత్ర ఎవరిది? తెలంగాణ అసెంబ్లీలో గడిచిన రెండు రోజులుగా అధికార పక్షం పైచేయి సాధించినట్లు కనపడుతోందంటున్నారు పరిశీలకులు. గత అసెంబ్లీ సమావేశాలకు, ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశాల్లో పనితీరుని బేరీజు వేసుకుంటే కొంత పట్టు సాధించినట్లు కనపడుతోందట. రెండు రోజులు అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలుగా వ్యవహారం నడిచింది. సబిత ఇష్యూని అజెండాగా మార్చుకోవాలని డిసైడైంది బీఆర్‌ఎస్‌. అందులో భాగంగానే రెండో రోజు కూడా…. ఇష్యుూని రైజ్‌ చేసింది. ఐతే అదే సమయంలో అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రారంభం నుండి మొదలుకొని…బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేయడం…మహిళా సభ్యులు పోడియం ముందు నిరసన తెలపడం వంటి వాటినన్నిటినీ లైట్ తీసుకున్న అధికారపక్షం… స్కిల్ యూనివర్సిటీ బిల్లుకి ఆమోద ముద్ర వేయించుకోగలిగింది. సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపుతున్నా… అన్ని పక్షాల సభ్యులతో మాట్లాడించింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు రావడంతో….దాన్నో అస్త్రంగా మార్చుకుంది అధికార పార్టీ. సిఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో పాటు ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ, సభలో అందరు సభ్యులతో మాట్లాడించాలని వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసింది సర్కార్‌. దీంతో సభలో సభ్యులు అదే అంశం మీద మాట్లాడాల్సి వచ్చింది.

బీఆర్‌ఎస్‌ సభ్యులకు మైక్‌ ఇచ్చినా… వారు కూడా కేవలం వర్గీకరణ అంశంపైనే మాట్లాడాలని కట్టడి చేయగలిదింది అధికారపక్షం. సబితా ఇంద్రారెడ్డి ఎపిసోడ్ పై మాట్లాడే ప్రయత్నం చేసినా.. సభాపతి కూడా సబ్జెక్ట్‌ నుంచి పక్కకు వెళ్లవద్దంటూ సభను కంట్రోల్ చేశారు. దీంతో… అటు సబిత ఎపిసోడ్‌లో గులాబీ దళాన్ని కట్టడి చేయడంతో పాటు ఇటు వర్గీకరణపై కూడా వాళ్ళకు వాదన లేకుండా చేయగలిగారన్న టాక్‌ మొదలైంది. ఈ క్రమంలోనే రెండు రోజులుగా అధికార పక్షం పైచేయి సాధిస్తోందన్న చర్చ మొదలైంది. ఇక సబితా ఇంద్రారెడ్డి ఎపిసోడ్ లో… డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కౌంటర్ టోటల్ ఎపిసోడ్‌లో హైలైట్‌. సబిత వ్యవహారంపై సిఎం రేవంత్ స్పందించిన తర్వాత.. సభ కొంత హీటెక్కింది. ఆ టెంపోని పీక్స్‌కు తీసుకువెళ్ళారు భట్టి. గతంలో సబిత కాంగ్రెస్‌ని మోసం చేశారన్న విషయాన్ని సభ సాక్షిగా ఆయన చక్కగా ఎస్టాబ్లిష్‌ చేయగలిగారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట పార్టీ వర్గాల్లో. ఇక శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఫామ్‌లోకి వచ్చారని, భట్టి, శ్రీధర్ బాబు కలిసి రెండు రోజులుగా సభను పూర్తిగా అధికారపక్షానికి అనుకూలం చేయగలిగారని, దీన్ని బట్టి చూస్తుంటే… తొలుత కాస్త తొట్రుపడ్డా ప్రభుత్వం పైచేయి సాధించగలిగిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది రాజకీయ వర్గాల్లో.

Also Read

  • Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
  • Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • ntv
  • OTR
  • TG Assembly

తాజావార్తలు

  • Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు

  • Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌ విరాట్..

  • Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి

  • Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి

  • Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions