Site icon NTV Telugu

మధ్యంతర ఎన్నికలకు సిద్ధమా? టీఆర్ఎస్ కు బిజేపి సవాల్

NVSS Prabhakar

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత NVSS ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కల్తీ విత్తనాల అమ్మకం తెలంగాణ లో పతాక స్థాయిలో ఉందని NVSS ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ 7 ఏళ్లలో కనీసం ఏడుగురిపై కూడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. HMDA మాస్టరు ప్లాన్ కి భిన్నంగా 13 లింక్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని…టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల భూముల ధరలు పెంచేందుకు ఈ మార్పులు అని ఆరోపణలు చేశారు. HMDA పరిధిలోని ప్రతి ల్యాండ్ ట్రాన్సక్షన్ వెనుక కేటీఆర్ మిత్ర బృందం ఉందన్నారు. మా భూములు మాకేనని తెలంగాణ ఉద్యమం జరిగింది…ఈ రోజు భూముల అమ్మకం నిర్ణయం ఆక్రమించుకున్న భూములను తక్కువ ధరకు అమ్మడానికా? అని నిలదీశారు. మధ్యంతర ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమా అని సవాల్ విసిరారు NVSS ప్రభాకర్. వెంటనే భూముల అమ్మకాన్ని విరమించుకోవాలని..ప్రభుత్వ భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. అఖిల పక్ష సమావేశం పెట్టాలని…ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు…

Exit mobile version