NVSS Prabhakar Sensational Comments On Minister KTR: మంత్రి కేటీఆర్ ఒక లీక్ వీరుడని, ఆయన శాఖ అవినీతికి మారుపేరుగా మారిందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. అంబర్‌పేట ఫ్లై ఓవర్, ఉప్పల్ కారిడార్ పనులు ఆలస్యం అవ్వడానికి కారణం.. పురపాలక శాఖ మంత్రి నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. స్థానికులపై ప్రభుత్వం కక్ష కట్టిందని.. 3 రకాల నష్ట పరిహారాలు ఇచ్చారని చెప్పారు. పనులు జరగకపోవడానికి జీహెచ్ఎంసీ వైఫల్యమే కారణమన్నారు. కరెంట్ లైన్‌తో పాటు వాటర్ లైన్ షిఫ్ట్ కాలేదన్నారు. ఇంకా 28 కట్టడాలు తొలగించాలని తెలుసుకొని.. కేటీఆర్ చెంపలేసుకొని, ఆ పోస్టర్‌లను తీయించారని పేర్కొన్నారు. కేటీఆర్‌కు తన శాఖ మీద పట్టు లేదని అనడానికి ఇదే నిదర్శనమన్నారు. కేటీఆర్ మంత్రిత్వ శాఖను హై కోర్ట్ పలు అంశాల్లో తప్పు బట్టిందని గుర్తు చేశారు. ‘కేటీఆర్.. ముందు నీ శాఖ గురుంచి పట్టించుకో’ అంటూ సూచించారు. అడుగడుగునా తాము వెంటపడుతున్నామన్నారు. నీటి పన్ను లేదని చెప్పిన మునిసిపల్ మంత్రి.. రూ.10 వేల బిల్లు వేశారని వెల్లడించారు. కాగా.. ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణంలో జాప్యంపై ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలుగుచూశాయి. ఐదేళ్లు అవుతున్నా, 40 శాతం పనులు కూడా పూర్తవ్వలేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆ పోస్టర్‌లో ముద్రించారు. ఈ పోస్టర్ల కలకలం నేపథ్యంలోనే.. ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ పైవిధంగా స్పందించారు.
Love Marriage : బిడ్డ టీచరు.. తండ్రి ప్రొఫెసర్.. పరువు పోతుందని అంత పని చేశాడు
అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పాలన సాగడం లేదని ఆరోపించారు. కవిత న్యాయ సలహా కోసం ప్రభుత్వ అధికారులను వాడుకుంటుందని.. పోలీసు ఉన్నత, న్యాయ ఉన్నత అధికారులు కవిత ఈడీ కేసు రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటున్నారంటూ చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, పంట నష్టం, నగరంలో భవనాలు కూలుతున్నా, కాలుతున్నా పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. రాష్ట్రంలో బంధుప్రీతితో కూడుకున్న పాలన నడుస్తోందన్నారు. మంత్రులు ప్రభుత్వపరమైన విషయాలు పక్కన పెట్టేసి.. రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లలో అనేకసార్లు పంట నష్టం జరిగినా.. సీఎం ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీలో రోజుకో విషయం వెలుగుచూస్తోందని, తవ్వుతున్న కొద్ది పేర్లు బయటికి వస్తున్నాయని అన్నారు. ఒకటికన్నా ఎక్కువ సంఖ్యలో పేపర్లు లీకేజీ జరిగాయని తెలుస్తోందని, దీనికి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే స్వయంగా కేసీఆర్ తన తనయుడైన కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.
Bhatti Vikramarka: తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదు.. కేసీఆర్ మోసం చేశారు
