NVSS Prabhakar: బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చేవాల్లంతా కేసిఆర్, కేటీఆర్ చెబితేనే వస్తున్నారని బీజేపీ కార్యాలయం NVSS ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పోలీసులు వాళ్లకు వాళ్ళే చేశారా, DGP చెప్తే చేశారా.. అప్పటి సీఎం చెప్తే చేశారా? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ నీ మొదట ముద్దాయిగా విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. అప్పటి DGP నీ ఎందుకు విచారించడం లేదు? అని ప్రశ్నించారు. డీజీపీ, కేటీఆర్, కేసిఆర్ అప్పటి మంత్రులు.. ఈ నలుగురిని విచారించాలని కోరారని తెలిపారు.
Read also: Pana Devi : మూడు స్వర్ణాలు సాధించిన 92ఏళ్ల వృద్ధురాలు.. ఈ సారి స్వీడన్‌లో సత్తా చాటనుంది
కాళేశ్వరం పై కూడా విచారణ ఆపారు..దానిపై కూడా పూర్తి విచారణ జరపాలన్నారు. ఉచిత గొర్రెలు పథకంలో కూడా అవినీతి జరిందంది..దీనిపై అప్పటి మంత్రులపై విచారణ చెయ్యాలని అన్నారు. ఏ పథకం ఈ 100 రోజుల్లో అమలు చేసావో సిఎం రేవంత్ రెడ్డి చెప్పకుండ రిఫరెండం గురించి మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ పాలన బయట పడుతుందని భయపడి రిఫరెండం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చేవాల్లంతా కేసిఆర్,కేటీఆర్ చెబితేనే వస్తున్నారని తెలిపారు.
Read also: Gadwal Vijayalakshmi: కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్న మేయర్.. పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన సీఎం
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరినొకరు కాపాడుకోవడం కోసం పనిచేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ లో భవిష్యత్తు లేదని, ఓడిపోతే పార్టీ అని బీజేపీ లోకి వస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతంత సంఖ్య బలం ఉన్న కాంగ్రెస్ నీ కాపాడటం కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. రాహుల్ గాంధీ చెబితేనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఒప్పందం తోనే కాంగ్రెస్ నీ కాపాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచెయ్యలనుకుంటున్నాయని అన్నారు.
TS Electric Power: రికార్డుస్థాయిలో విద్యుత్తు వినియోగం.. మే నెల రికార్డులు మార్చిలోనే..