Site icon NTV Telugu

హైద‌రాబాద్‌లో న‌ర్సు నిర్ల‌క్ష్యం.. ఫోన్ మాట్లాడుతూ యువ‌తికి 2 డోసుల వ్యాక్సిన్..!

vaccine

క‌రోనా వైర‌స్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. క్ర‌మంగా వ్యాక్సిన్ వేసుకోవ‌డానికి మొగ్గు చూపుతున్నా.. కొన్ని భ‌యాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.. అయితే, అక్క‌డ‌క్క‌డ న‌ర్సులు, వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యం క‌నిపిస్తోంది. హైద‌రాబాద్ శివారులో విధుల్లో ఉన్న న‌ర్సు ఫోన్ మాట్లాడుతూ.. ఓ యువ‌తికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసింది.. కాసేప‌టికి క‌ళ్లు తిరిగిప‌డిపోయిన ఆ యువ‌తిని హుటాహుటిన ఆస్ప‌త్రిలో చేర్చాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.. వివ‌రాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ ఓ యువతి వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి వెళ్లింది.. అక్క‌డ విధుల్లో ఉన్న న‌ర్సు.. ఫోన్ మాట్లాడుతూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది. ఆ యువ‌తికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసేసింది.. ఇక‌, వ్యాక్సిన్ తీసుకున్న కాసేప‌టికే స‌ద‌రు యువ‌తి క‌ళ్లు తిరిగి ప‌డిపోగా.. వెంట‌నే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు.. ఆస్ప‌త్రిలో యువ‌తిని అబ్జర్వేషన్ లో పెట్టిన వైద్యులు.. ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని చెబుతున్నారు.

Exit mobile version