Nude video call to government employee: హైదరాబాద్‌లో న్యూడ్ వీడియో కాల్ కలకలం రేపింది. స్వీట్ వాయిస్ హాట్ వీడియోస్ ముగ్గులోకి దింపేందుకు ఊరిస్తున్నారు. ఇక ఆవీడియోలకు, వాయిస్ లకు టెంమ్ట్ అయ్యారో మటాష్ అవ్వాల్సిందే.. జేబు ఖాలీ కావాల్సిదే.. తాజాగా హైదరాబాద్ లో న్యూడ్ వీడియో కాల్ సంచలనంగా మారింది. ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఓ అందమైన అమ్మాయి నుంచి కాల్ వచ్చింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెబుతూ వచ్చిన ఆకిలాడీ లేడీకి ఆ ఉద్యోగి కాస్త రిప్లై ఇచ్చాడు. ఇక అంతే యువకుడు షాక్‌కు గురైయ్యాడు. అలా ఫోన్ కట్ చేశాడో లేదో.. ఇలా వాయిస్ మెసేజ్‌తో పాటు మరో ఫోన్ కాల్ వచ్చింది. నీ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఎక్కడ తన పరువు పోతుందో అన్నభయంతో ఆ ఉద్యోగి సుమారు రూ.5 లక్షల వరకు ఆకిలాడీ లేడీ కాజేసింది. దీంతో ఆ ఉద్యోగి లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. కాల్ వచ్చిందని ప్రేమ పేరుతో మాట్లాడుతూ న్యూడ్ కాల్ చేసిందని ఇంతలోనే మరో కాల్ వచ్చి బ్లాక్ మైల్ చేసిందని వాపోయాడు. తనతో వున్నట్లు ఫోటోలను బయటపెడతానని బెదిరించిందని దీంతో చేసేదేమి లేక డబ్బులు పంపించాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొ్న్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు చేయడంతో ఈవిషయం కాస్త వెలుగులోకి వచ్చింది.
Read also: Harish Rao: కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన కారణ జన్ముడు
ఇలాంటి ఘటనలు భాగ్యనగరంలోనే కాదండోయ్ జిల్లాలకు కూడా పాకింది. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నగ్నంగా యువతి వీడియో కాల్ చేసింది. ఆ యువకుడు ఏంటా అని తీసి చూసేలోగానే అంతా జరిగిపోయింది. ఇంతలోనే బెదిరింపులు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన యువకుడికి గుర్తు తెలియని యువతి నగ్నంగా వీడియో కాల్ వచ్చింది. ఆ యువకుడు సెల్ బటన్ నొక్కాడో లేదో.. అంతలోనే వీడియో కాల్ రికార్డ్ చేశానని డబ్బులు పంపించకుంటే యూట్యూబ్లో పెడతానని బెదిరించింది యువతి. కాల్ కట్ చేసిన యువకుడు భయాందోళనకు గురయ్యాడు. అంతలోనే మరో వ్యక్తి నుంచి కాల్.. ఢిల్లీ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానని యువతి నీపై కేసు పెట్టిందని డబ్బులు పంపించాలని ఆ యువకుడ్ని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు 60 వేల రూపాయలను విడతలవారీగా పంపించాడు. కాసేపు భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా పోలీసులను ఆశ్రయించడమే సబబని భావించిన యువకుడు.. పోలీస్టేషన్ కు వెళ్లాడు జరగిందంతా చెప్పాడు. కేసు నమోదు చేసిన కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మల్లీ మొదలయ్యాయని ప్రజలు అప్పమత్తంగా ఉండాలని కోరారు. అలాంటి కాల్స్ వస్తే పోలీసులకు ముందుగా తెలపాలని కోరారు.
Read also: Supreme Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఆరోజుకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఇలా ఫోటోలు లేదా న్యూడ్ వీడియోస్ తో సైబర్ కేటుగాళ్లు మోసాలకు దిగుతున్నారని మరి కొంతమంది ఎవ్వరితో చెప్పులేక ఎంతో కొంత ఇచ్చి వదిలేసుకుంటున్నారని ఇది నేరమని తెలిపారు. కొంత మంది మాత్రం పోలీసులను ఆశ్రయిస్తున్నారని, మరి కొంతమంది మాత్రం తన పరువు పోతుందేమో అని నంబర్ బ్లాక్ చేసి సైలెంట్ గా ఉంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సెల్ ఫోన్లకు మెసేజ్‌లు లేదంటే ఫోన్ చేసి ఓటిపీల పేరుతో సైబర్ వల వేసిన కేటుగాళ్లు ఇప్పుడు కాస్త రూట్ మార్చారని అన్నారు. గతంలో జిల్లా ఓ అధికారి ఫోటోనే డీపీగా పెట్టి జిల్లాలోని అధికారులకు వరుసబెట్టి మెస్సెజ్ లు పెట్టేసిన తీవ్ర కలకలం రేపింది. అలా కొంతమంది పోలీసులను ఆశ్రయిస్తే ఓ వైద్యుడు మోసపోయాడు. ఇక ఇవ్వన్ని బంద్ చేసి మోసగాళ్లు ఇప్పుడు హనీ ట్రాప్స్ తో చీటింగ్ చేస్తున్నారు. ఓ వకీల్ కు సైతం ఇలాంటి సైబర్ నేరగాళ్ల ఆగడాలు మొదలయ్యాయి. తను పోలీసులను ఆశ్రయించడంతో అందులో నుంచి భయటపడ్డారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల భారీగా సైబర్ నేరాలు జరగ్గా కేసు నమోదు అయ్యాయి.. కేవలం ఆదిలాబాద్ జిల్లాలో ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.. మంచిర్యాల జిల్లాలో వరుసబెట్టి సైబర్ నేరాలు జరగుతుండగా పోలీసులు ఏకంగా యూత్ లో సైబర్ నేరాల పట్ల అవగాహనకల్పిస్తున్నారు. డబ్బులు అడగడం కోసం కొత్త కొత్త ట్రిక్స్ ఫాలో అవుతున్నారని యువకులైనా ఎవ్వరైనా ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు.. డబ్బుల కోసం ఎవ్వరైనా ఎవ్వరి డీపీలతో చాట్ చేస్తే అనుమానం రాగానే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు… వాట్సాప్ చాటింగ్ లను నమ్మిమోస పోవద్దంటున్నారు.
Sunday Funday: నగర ప్రజలకు గుడ్ న్యూస్.. మరింత ఆకర్షణీయంగా సన్‌డే ఫన్‌డే..