NTV Telugu Site icon

Nude photo: మహబూబ్ నగర్‌ లో న్యూడ్ ఫోటోల కలకలం.. తాంత్రిక పూజలతో లైంగిక దాడి

Nude Photo

Nude Photo

Nude photos in Mahabubnagar: తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు న్యూడ్ వీడియో కాల్స్‌ కలకలం రేపిన విషయం మరువక ముందే ఇప్పుడు న్యూడ్‌ ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఇంట్లో సమస్యలు తొలుగుతాయని, డబ్బులు కురుస్తాయని చెప్పడంతో మహిళలు నమ్మారు. దీంతో వారిని బ్లాక్‌ మైయిల్‌ చేసి, నగరానికి తీసుకువచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్‌ జిల్లా జడ్చర్ల లో సంచలనంగా మారింది.

Read also: Dogs Attack: తెలంగాణలో హడలెత్తిస్తున్న కుక్కల దాడులు.. చైతన్యపురిలో ఒకరు, కరీంనగర్‌లో మరొకరు

మహబూబ్ నగర్‌ జిల్లా జడ్చర్ల లో న్యూడ్ ఫోటోల కలకలం రేపాయి. సమస్యలు తొలిగిపోయి, ఇంట్లో నోట్ల వర్షం కురుస్తుందని కేటుగాళ్ళు మహిళలను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన అమాయక ఆడవారు నిజంగానే సమస్యలు తొలిగిపోతాయని నమ్మారు. వారి కష్టాలు తొలగిపోయి మంచి జీవనం సాగుతుందని నమ్మడంతో.. వారి నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్న తాంత్రికుడు పూజలు చేయాలని నమ్మించాడు. ఫోటోలు ఎందుకు అని అడిగినా పూజలకు అవసరమని నమ్మించాడు. న్యూడ్‌ ఫోటోలైతే ఇంకా త్వరగా సమస్యలు తొలగిపోతాయని మహిళలను నమ్మించి మహిళలను న్యూడ్‌ ఫోటోలు తీశాడు. తాంత్రిక పూజలకు ఉపయోగిస్తున్నానని నమ్మించిన హైదరాబాద్ లోని తాంత్రికుడికి పంపించాడు. అంతేకాకుండా.. పూజలపేరుతో పలువురి మహిళల్ని హైదరాబాద్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈవిషయాన్ని ఎవరికి చెప్పకూడదని ఒకవేళ చెబితే ఇప్పటి వరకు చేసిన పూజలు ఫలించవని బెదిరించాడు. దీంతో మహిళలు మోసపోయామని గ్రహించిన పోలీసులకు ఆశ్రయించడంతో తాంత్రికుడి అసలు గుట్టు రట్టు అయ్యింది. ఈఘాతుకానికి పాల్పడుతున్న ముగ్గురుని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈముఠాలో ఇద్దరు పురుషలతో పాటు ఒక మహిళకూడా ఉండటం గమనార్హం. అయితే వీరు మహిళల న్యూడ్‌ ఫోటోలను హైదరాబాద్‌ లోని కొందరికి పంపించారా? లేక మరెవరికైనా పంపించారా? వీళ్లు ముగ్గురే ఇలా మహిళలపై తాంత్రిక పూజలని చేస్తున్నారా? వీరితో పాటు మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Wednesday Stotram: విద్య, వివాహం, అభివృద్దికి ఈ స్తోత్ర పారాయణం చేయండి

Show comments