తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు న్యూడ్ వీడియో కాల్స్ కలకలం రేపిన విషయం మరువక ముందే ఇప్పుడు న్యూడ్ ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఇంట్లో సమస్యలు తొలుగుతాయని, డబ్బులు కురుస్తాయని చెప్పడంతో మహిళలు నమ్మారు. దీంతో వారిని బ్లాక్ మైయిల్ చేసి, నగరానికి తీసుకువచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో సంచలనంగా మారింది.