Site icon NTV Telugu

Film Nagar: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. రానున్న ఎన్టీఆర్ కుటుంబం..

Ntr 100

Ntr 100

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ నందు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా తరలి రానున్నారు.

ఈ కార్యక్రమానికి నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు.. నందమూరి జయకృష్ణ, గారపాటి లోకేశ్వరి గణేశ్వరారవు, నందమూరి మాధవి మణి సాయికృష్ణ, లక్ష్మి హరికృష్ణ ,నందమూరి మోహన కృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు, నందమూరి రామకృష్ణ, కంటమనేని ఉమ మహేశ్వరి శ్రీనివాస ప్రసాద్ ,నందమూరి జయశంకర్ కృష్ణ పాల్గొన‌నున్నారు.

అలాగే పరిటాల సునీత, పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరవనున్నారు. ఈ విగ్రహాన్నినందమూరి మోహన కృష్ణ గారు సమర్పించగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యే, దానం నాగేందర్ ఆవిష్కరించనున్నారు.మే 28న (ఇవాళ) ఉదయం 10 గంటలకు ఫిలింనగర్ లోని ఆనంద్ సినీ సర్వీసెస్ దగ్గర ఈ విగ్రహావిష్కరణ జరగనుంది.

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ ని ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయగా ఉదయం నుంచే అభిమానులు, సెలబ్రిటీలు ఆ మహనీయుడికి నివాళులు అర్పించేందుకు క్యూ కట్టారు.

Live : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

Exit mobile version