Breaking News : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్మానియూ యూనివర్సీటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌ను ఎన్ఎస్యూఐ విద్యార్థులు ముట్టడించారు. ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ సభకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ.. బిల్డింగ్ గేట్లు ఎక్కి లోపలికి విద్యార్థులు దూసుకెళ్లారు. అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అద్దాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో 17 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పోలీసుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ.. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సహా విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అరెస్టైన ఎన్ఐసీయూ విద్యార్థులను పరామర్శిచేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సైతం పోలీసులు నిర్భందించారు. అయితే.. ఈనెల 6,7 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఓయూలో పర్యటించేందుకు వీసీ అనుమతులు కోరగా.. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!