National Herald Case: తెలంగాణకు తాకిన నేషనల్ హెరాల్డ్ కేసు.. టీకాంగ్ నేతలకు నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Notices to Telangana Congress leaders in National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసు తెలంగాణకు తాకింది. నేషనల్ హెరాల్డ్ కేసులో టీకాంగ్ నేతకు నోటీసులు జారీచేసింది ఈడీ. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు, మాజీ ఎంపీ అంజన్ యాదవ్, షబ్బీర్ అలీ, మాజీ మంత్రి రేణుకాచౌదరికి సైతం నోటీసులు పంపించారని వార్తలు గుప్పుమన్నాయి. మొత్తం ఐదుగురికి ఈడీ నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే నేతలు మాట్లాడుతూ.. ఇంకా తమకు నోటీసులు అందలేదని తెలిపారు. దీంతో సర్వత్రా చర్చకు దారితీస్తోంది. అక్టోబర్ 10న డిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే సోనియా, రాహుల్ ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్, సోనియా గాంధీలను ప్రశ్నించింది ఈడీ.. మొదట్లో రాహుల్ గాంధీని సుదీర్ఘంగా విచారించి ప్రశ్నల వర్షం కురిపించింది.. ఆ తర్వాత సోనియా గాంధీని విచారణకు పిలిచింది.. అయితే, ఆ ఇద్దరి నుంచి ఒకే రకమైన సమాధాలు రావడంతో.. మూడో రౌండ్ విచారణ నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆరు గంటల పాటు సోనియాను ప్రశ్నించగా, కేంద్ర సంస్థల దుర్వినియోగంపై కాంగ్రెస్.. ఢిల్లీ, ఇతర చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయ తెలిసిందే.. నిరసన తెలిపినందుకు రాహుల్ గాంధీ సహా వందలాది మంది పార్టీ కార్యకర్తలు, అగ్రనేతలను అదుపులోకి అరెస్ట్ చేశారు పోలీసులు.. కానీ తర్వాత అందరినీ విడుదల చేశారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ జూన్ 21 నాలుగోరోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. దాదాపు 12 గంటలపాటు ఈడీ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. జూన్ 13, 14, 15 తేదీల్లో రాహుల్‌ను 30 గంటలకు పైగా ఈడీ లోతుగా విచారించడం తెలిసిందే. వరుసగా మూడు రోజులు ఈడీ ప్రశ్నల పరంపరను ఎదుర్కొన్న రాహుల్.. జూన్ 21న ఉదయం 11 గంటల సమయంలో ఈడీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ చేరుకున్నారు. విచారణ అనంతరం అర్ధరాత్రి 12.30 దాటిన తర్వాతే ఆయన ఇంటికి తిరిగివెళ్లారు. దీంతో మొత్తం 40 గంటలకు పైగా ఆయన విచారణను ఎదుర్కొన్నారు. జూన్ 16న కూడా విచారణ జరగాల్సి ఉండగా రాహుల్ అభ్యర్థన మేరకు ఈడీ ఒక్క రోజు విరామమిచ్చింది. ఆస్పత్రిలో ఉన్న తన తల్లి సోనియాగాంధీ బాగోగులు చూసుకోవాల్సి ఉందని కోరడంతో వాయిదా వేసింది. అయితే.. ఈ కేసులో సోనియాను కూడా 23న ఈడీ విచారణకు పిలవడం తెలిసిందే.
యంగ్ ఇండియన్, ఏజేఎల్, నేషనల్ హెరాల్డ్ వ్యవహారాల్లో రాహుల్ కీలక వ్యక్తి గనుక ఆయన వాంగ్మూలం చాలా కీలకమని ఈడీ వర్గాలు అంటున్నాయి. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్, సోనియా గాంధీలను ప్రశ్నించింది ఈడీ.. మొదట్లో రాహుల్ గాంధీని, ఆ తర్వాత సోనియా గాంధీని విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. సోనియా గాంధీని మూడరోజులపాటు మూడు గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. అయితే.. ఈ కేసులో ప్రస్తుతానికి విచారణ ముగిసినట్టేనని , విచారణ ముగించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తదుపరి స్టెప్ ఎలా ఉంటుంది..? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పై దృష్టి సారించడం పై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. ముగ్గురు మాజీ మంత్రులపై ఈడీ నోటోసులు పంపడంపై చర్యకు దారితీస్తోంది.
తాజావార్తలు
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!