Site icon NTV Telugu

Formula E Race: ఫార్ములా-ఈ రేస్‌కు కోట్లలో చెల్లింపులు.. సీనియర్ IAS అరవింద్ కుమార్‌కు మెమో..!

Dormula E Race

Dormula E Race

Formula E Race: తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా-ఇ రేస్ నిర్వహణపై వారంలోగా వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరవింద్ కుమార్‌ను కోరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు మెమో జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖతో పాటు పలు కీలక శాఖల్లో పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ నుంచి విపత్తు నిర్వహణ విభాగానికి బదిలీ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో ఫార్ములా ఇ రేస్ పోటీలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేస్ పై నిర్వాహకులు సానుకూలంగా స్పందించలేదు. ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు గత వారం ప్రకటించారు.

Read also: Sexual Assault: 500 మంది అమ్మాయిలను వేధించిన ప్రొఫెసర్..

అయితే, ఫార్ములా ఈ రేస్ 9,10వ సీజన్‌ల కోసం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా.. పార్మూలా ఈ రేస్ నిర్వహణకు గాను ప్రభుత్వ అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నుండి రూ. 50 కోట్లు బదిలీ చేశారని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు కాంగ్రెస్ సర్కార్ మెమో జారీ చేసింది. వివరణ సంతృప్తికరంగా లేకుంటే అరవింద్ కుమార్ పై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. కాగా.. ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎండీఏకు రూ. 50 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల విడుదలకు ఎవరు అధికారం ఇచ్చారని మెమోలో ప్రశ్నించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసిందని అభిప్రాయపడ్డారు.

Read also: KA Paul: సీఈసీని కలిసిన కేఏ పాల్.. పోలింగ్‌ రోజే రిజల్ట్‌ కూడా ప్రకటించాలి..!

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లీజుపై అప్పట్లో పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ రేవంత్‌రెడ్డికి లీగల్‌ నోటీసులు పంపారు. ఆ సమయంలో ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి తాను అడిగిన సమాచారం ఇవ్వకుండా తాను ప్రస్తావించిన ఆరోపణలపై లీగల్ నోటీసులు జారీ చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ప్రభుత్వం అరవింద్ కుమార్‌కు మెమో పంపింది.
Chlorine Gas Leak: ఉత్తరఖండ్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన పెను ప్రమాదం!

Exit mobile version