ప్రెస్ మీట్లు కాదు.. ప్రజల ఇబ్బందులపై సమీక్ష చేయండని ఎంపీ దర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాతూ.. 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమవుతోందని పేర్కొన్నారు. చెరువులు, రిజర్వాయర్లు కూడా పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. ముందే జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది ప్రజలను కాపాడొచ్చని సలహా ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులు, జిల్లా అధికారుల సమన్వయ లోపం కళ్ళకు కట్టినట్టు కనపడుతోందని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో దాదాపు 200 మంది పునరావాస కేంద్రంలో ఉన్నారు. 8 వేల ఎకరాలు పూర్తిగా నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
350 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసిందని, కానీ ఇది రెండు, మూడింతలు పెరిగే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇండ్లు, బ్రిడ్జీలు మునిగిపోతున్నాయ్, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకపోవడం మంచిదైందని ఎద్దేవ చేశారు. ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో నీట మునిగాయని మండిపడ్డారు. కేసీఆర్.. రెండు గంటల ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు.. 2 గంటలు ఇబ్బందులపై సమీక్ష నిర్వహించాలని సలహా ఇచ్చారు. వానాకాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే సీజన్ అయిపోయే వరకు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండని అన్నారు. కేసీఆర్ దుర్మార్గుడు, అబద్దాల కోరు అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని 9 జిల్లాలు వెనుకబడినవిగా గుర్తించారని అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి కేంద్రం రోడ్ల అభివృద్ధికి 50 కోట్లు కేటాయించిందని అన్నారు. అలా 450 కోట్లు వచ్చాయని అన్నారు. అభివృద్ధి చేపట్టకుండా సుమారు 3 వేల కోట్లు స్కామ్ చేశారని మండిపడ్డారు.
read also: మానవుడిని చంపుతున్న జీవులు ఇవే..
నీతి అయోగ్ పరిశీలనకు వస్తుందని తెలిసి వీరి పేర్లు తొలగించి కేంద్రం ఇచ్చినట్లుగా మళ్ళీ శిలా ఫలకాలు వేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎంత సుపరిచితుడో అంత సోమరిపోతు అంటూ ఎద్దేవ చేశారు. కట్టలు తెగిపోతుంటే పట్టించుకోవట్లేదని, బర్రె మీద నీళ్లు పోసినట్లు కేసీఆర్ పరిస్థితి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాఠశాలల్లో పుస్తకాలు లేవని, ఉద్యోగులకు జీతాల్లేవని అన్నారు. కేసీఆర్ చదివిన బడి శిథిలావస్థకు చేరిందని, 10 కోట్లు పెట్టి కొత్త భవనం నిర్మించారని గుర్తు చేశారు. రెండేళ్లుగా ప్రారంభించడం లేదని, కిటికీలు ఊడిపోతున్నాయని మండిపడ్డారు. మా కలెక్టరేట్ ను కూడా ఇప్పటి వరకు ప్రారంభించలేదని ఎద్దేవ చేశారు. విద్యాశాఖ, వైద్య శాఖలో 70 శాతం ఖాళీలుగానే ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మత్తు వినియోగంలో కేసీఆర్ సర్కారు ఇంజిన్ రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతోందని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో 56 శాతం అఘాయిత్యాలు జరిగితే రాష్ట్రంలో 90 కి పైగా జరుగుతున్నాయని ఎద్దేవ చేశారు.
Read also: Kakani Govardhan Reddy: అది నిజం కాదా..? బాబు, పవన్ సమాధానం చెప్పాలి..!
జాతీయ స్థాయిలో నిరుద్యోగ శాతం 7.4 ఉంది. తెలంగాణ లో 10 శాతం ఉందని గుర్తు చేసారు. దేశంలో తెలంగాణ జీడీపీ 8వ స్థానంలో ఉంది, కానీ కేసీఆర్ తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి 49.7 శాతం ఉందని, అగ్నిపథ్ లో భాగంగా ఎయిర్ ఫోర్స్ కు వచ్చిన అప్లికేషన్లు 8 లక్షలు, అన్ని రికార్డులను ఈ సంఖ్య బ్రేక్ చేసిందని, 2020 దాక బీజేపీ, మోడీని పొగిడి.. బిడ్డను ఓడించగానే తిడుతున్నాడంటూ మండిపడ్డారు. వేరే ప్రాంతాల నుంచి బొగ్గు ఎందుకు దిగుమతి చేస్తుందో కూడా బేవకూఫ్ కేసీఆర్ కు తెలియదని పేర్కొన్నారు. మన దగ్గర బొగ్గులో నాణ్యత చాలా తక్కువ. అందుకే బొగ్గు దిగుమతి చేస్తున్నామని అన్నారు. రైతులకు,బీడీ కార్మికులకు నువ్వు ముష్టి వేస్తున్నవా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. నీ బిడ్డకు 2 వేలు ఇవ్వు.. ఎమ్మెల్సీ ఎందుకు చేశావ్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
వచ్చే పంటకు ఏం వేయాలో ఇప్పటి వరకు చెప్పలేదని అన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్లు చూడడం ప్రజలు బంద్ చేయాలని విజ్ఞప్తి చేసారు. కేసీఆర్.. నీకు దమ్ముంటే 2014-2018 మేనిఫెస్టోపై మాట్లాడాలని సవాల్ విసిరారు. జోగులాంబ అమ్మవారిపై మాట్లాడుతావా.. ముస్లింలపై మాట్లాడి చూడు.. దమ్ముంటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మసీదు లపై మాట్లాడి చూడు కోడి మెడ కోసినట్లు కోసి పడేస్తారంటూ మండిపడ్డారు. కల్చర్ లెస్ ఫెలో.. అంటూ విమర్శించారు. లయ్యర్, థర్డ్ గ్రేడ్ ఫెలో.., యూస్ లెస్ ఫెలో..అంటూ మండిపడ్డారు. మేము కేసీఆర్ లెక్క సంస్కార హీనులం కాదని, కేసీఆర్ ఎంత చిల్లర గాడో.. అందరికీ అర్థమైందని అన్నారు. చెంప దెబ్బకు.. దవడ పళ్ళు రాలగొడతాం అంటూ ఎంపీ దర్మపురి అరవింద్ తీవ్రంగా విమర్శించారు.
Balasani Laxminarayana: వరద పెరగడానికి కారణం పోలవరం ప్రాజెక్ట్
