NTV Telugu Site icon

Munugode Bypoll: ముగిసిన నామినేషన్ల స్వీకరణ గడువు.. క్యూలైన్‌లో భారీగా అభ్యర్థులు..

Munugode

Munugode

తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి… అన్ని ప్రధాన పార్టీలు కేంద్రీకరించి ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. మరోవైపు.. చిన్నపార్టీలు కూడా బరిలోకి దిగాయి.. ఇక, స్వతంత్రులు కూడా భారీ సంఖ్యలో పోటీకి దిగేలా కనిపిస్తోంది.. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది.. అయితే, ఇంకా చాలా మంది అభ్యర్థులు.. నామినేషన్‌ పత్రాలతో క్యూ లైన్‌లో వేచిఉన్నారు.. క్యూలైన్‌లో ఉన్న అభ్యర్థుల నామినేషన్ల వరకు స్వీకరిస్తున్నారు అధికారులు.. మొత్తంగా ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లు.. సెంచరీ దాటేస్తాయనే చర్చ కూడా సాగుతోంది..

Read Also: Fraud: సినిమాల్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి..!

మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.. అయితే, 3 గంటలలోపు క్యూలైన్ లో ఉన్న వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇచ్చారు.. ఇప్పటికే 70 నామినేషన్లు దాఖలు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. క్యూలైన్‌లో మరో 20 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలతో సిద్ధంగా ఉన్నారు.. మొత్తంగా 90 నుంచి 100 మధ్య నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కాగా, చివరి రోజు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేశారు.. చివరి నిమిషంలో గద్దర్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.. ఇక, రేపు నామినేషన్ల పరిశీలన ఉండగా… ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.. నవంబర్‌ 3న పోలింగ్ జరగనుండగా… నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కించి.. ఫలితాలు ప్రకటించనున్నారు.. ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరగనుంది.. టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉండబోతుందని స్పష్టం అవుతోంది. టీఆర్ఎస్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. ఇప్పటికే చిన్న లీడర్ల నుంచి బడా లీడర్ల వరకు అంతా మునుగోడుపైనే ఫోకస్‌ పెడుతున్నారు.