Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News No Purchases In Paddy Purchase Centers

Paddy Purchase: ఆర్భాటంగా ప్రారంభం.. కొనుగోళ్ళు శూన్యం

Published Date :April 25, 2022 , 12:49 pm
By NTV WebDesk
Paddy Purchase: ఆర్భాటంగా ప్రారంభం.. కొనుగోళ్ళు శూన్యం
  • Follow Us :
  • google news
  • dailyhunt

యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించాక ధాన్యం కొనుగోలు కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో రైతుల నుంచి ఇప్పటి వరకు ఒక్క గింజ ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ళ ను ప్రారంభించినా కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ యాసంగిలో సుమారు 11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 14 లక్షల 50వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనావేశారు. ఇందుకు గానూ ఉమ్మడి జిల్లాలో 934 కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లల్లో జాప్యం తో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటన వచ్చి వారం రోజులు అయినా ఉమ్మడి జిల్లాలో సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే కొన్ని సెంటర్లు ప్రారంభమైనా యాదాద్రి జిల్లాలో రైతుల నుంచి ఇప్పటివరకు ధాన్యం కొనలేదు. రిబ్బన్ కట్ చేసి సెంటర్లను ఓపెన్ చేస్తున్న ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆ తర్వాత కొనుగోళ్లు సాగుతున్నాయా లేదా? అని పట్టించుకోవడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రా లకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగి సీజన్లో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా లక్ష ఆరువేలమంది రైతులు 1 లక్ష 65 వేల 352 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 3 లక్షల 55 వేల 770 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 280 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను 34 సెంటర్లు ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటి వరకు ఏ సెంటర్లో కూడా ధాన్యం కొనలేదు. కొనుగోళ్లు జరిగేందుకు ఇంక వారం పట్టే అవకాశం ఉంది.గన్నీ బ్యాగుల కొరత,ఏ సెంటర్ నుంచి ఏ మిల్లుకు వడ్లను తరలించాలన్న అంశంపై క్లారిటీ రాకపోవడం, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కు వెహికిల్స్ కేటాయించక పోవడంతో ధాన్యం కొనుగోలు లో జాప్యం జరుగుతోంది.

ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు రైస్ మిల్లర్లకు మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటినీ ప్రారంభించి ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని రైతులు కోరుతున్నారు.

Read Also: Botsa Satyanarayana: సీఎం ఇంటిని ముట్టడిస్తానని చెప్పడం సరికాదు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • farmers troubles
  • ministers opening
  • MLA
  • no purchases in paddy-purchase centers

తాజావార్తలు

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

  • స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?

  • Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!

  • Peddi : ఎప్పుడు వచ్చినా టెన్షన్ లేదు!

  • Rajnath Singh: ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో దేవుడికే తెలియాలి..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions