NTV Telugu Site icon

Governor Tamilisai : గవర్నర్ కార్యాలయంలో ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవు

Tamilisai On Brs

Tamilisai On Brs

గవర్నర్‌ బిల్లులను ఆమోదించడం లేదంటూ ఇప్పటికే పలు మార్లు రాష్ట్రప్రభుత్వం ఆరోపణలు చేసింది. అంతేకాకుండా.. పెండింగ్‌ బిల్లులపై సుప్రీంకోర్టుకు కూడ వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. ఇటీవల ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్‌కు మంత్రి హరీష్ రావు కౌంటర్‌ ఇచ్చారు.

Also Read : SS Thaman: అభిమానుల నుంచి ప్రెజర్.. అవి చూసి తేజ్ ఏడ్చేశాడన్న థమన్

తెలంగాణ ప్రభుత్వం గురించి ప్రధాని మోడీ మాట్లాడే ముందు గవర్నర్‌ తమిళిసై దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లుల గురించి ప్రస్తావించాలని కౌంటర్‌ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. అయితే.. దీనిపై తాజాగా రాజ్‌భవన్‌ స్పందిస్తూ.. గవర్నర్ కార్యాలయంలో ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని స్పష్టం చేసింది. బిల్లులలో మూడు బిల్లులు క్లియర్ అయ్యాయని, రెండు బిల్లులు రాష్ట్రపతి కార్యాలయానికి పంపామని తెలిపింది. మిగిలిన బిల్లులు తగిన వివరణ కోసం ప్రభుత్వానికి తిరిగి పంపామని గవర్నర్‌ కార్యాలయం బదులిచ్చింది.

Also

అయితే.. తెలంగాణ ప్రభుత్వం పంపించిన అనేక బిల్లుల్ని గతంలో వివిధ కారణాలతో తొక్కిపట్టారని గవర్నర్ తమిళిసై ఆరోపణలు చేశారు బీఆర్ఎస్‌ నేతలు. మూడు బిల్లులను బాగా ఆలస్యంగా ఆమోదించారని, మిగతా వాటి విషయంలో కూడా ఆమె సానుకూలంగా స్పందిస్తారనుకున్నా కుదర్లేదని ఆరోపించారు. అయితే ఇప్పుడు గవర్నర్‌ కార్యాలయం ఆ బిల్లుల విషయంలో స్పందించి మొత్తమ్మీద తమ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని చెప్పాయి. ఈ ప్రకటనపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.