Asaduddin Owaisi: మోడీ ప్రసంగాలు వినే ఉద్దేశ్యం లేకనే నేను పార్లమెంట్ కు వెళ్ళలేదని ఎం.ఐ.ఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్ లో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. పిసీసీ చీఫ్ గా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం ఉందని మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర సెక్రటేరియట్ తో పాటు బాపు ఘాట్ ఇంకా ఎన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. రాష్ట్ర పరిపాలన విభాగం ఎఫ్ టి ఎ లో ఉన్నపుడు లేని ఇబ్బంది పేదల ఇల్లు ఉంటే ఇబ్బంది ఏమిటి? అని ప్రశ్నించారు. అభివృద్ధి కి మేం మద్దతు ఇస్తాం .కానీ పేదలు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. నిజామాబాద్ లో మజ్లిస్ పార్టీ నీ బలోపేతం చేసుకుంటామన్నారు. మోడీ పాలనలో ముస్లిం మైనార్టీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
Read also: Israel Hamas War: హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి ఏడాది.. కొనసాగుతున్న బాంబుల వర్షం
మోడీ ప్రసంగాలు వినే ఉద్దేశ్యం లేకనే నేను పార్లమెంట్ కు వెళ్ళలేదన్నారు. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో ఒక్క ముస్లిం ఎంపీ లేరని గుర్తు చేశారు. మైనారిటీ ల అభ్యున్నతి కోసం స్థానిక సంస్థల తో పాటు అన్ని చోట్ల ఎం ఐ ఎం ఆవశ్యకత ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం అర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కనుసన్నల్లో నడుస్తుందన్నారు. ముస్లిం వ్యతిరేకంగా ట్రిబుల్ తలాక్, సీ ఏ ఏ, లాంటి చట్టాలు తెస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. గుజరాత్ సోమనాథ్ లో దర్గా, కబ్రస్థాన్ లు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా అక్కడి ప్రభుత్వం 12 వందల ఏళ్ల చరిత్ర ఉన్న మజీద్ ,కబ్రస్థన్ లు బుల్దొసర్లు పెట్టి కులగొట్టారన్నారు. బీజేపీ తలపెట్టిన వక్ఫ్ బోర్డు అడ్డుకుంటామన్నారు. మహారాష్ట్ర లో ఎం.ఐ.ఎం. గెలుపుకు ప్రతి ఒక్క ముస్లిం కృషి చేయాలన్నారు. మహారాష్ట్ర,కాశ్మీర్,హర్యానాలో బీజేపీ ఓటమి ఖాయమని అసదుద్దీన్ ఓవైసి అన్నారు.
Amit Shah: నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ..